ఈటల రాజేందర్ బ్యాక్ స్టెప్! 

Publish Date:May 5, 2021

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో రగిలిపోతున్న ఈటల... కేసీఆర్ తో అమీతుమీకి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరిగింది. ఈటల మద్దతుదారులు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈటల సీఎం సీఎం అంటూ నినదిస్తున్నారు. రాజేందర్ కూడా హుజురాబాద్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో .. ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కారు సింబల్ తో గెలిచిన పదవి తనకు అక్కర లేదని ఈటల చెప్పడంతో.. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడం ఖాయమని అంతా భావించారు.

ఈటల రాజేందర్ హుజూరాబాద్ పర్యటన తర్వాత సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది. ఈటలను కలిసిన మద్దతుదారులు.. రాజీనామాపై భిన్నాభిప్రాయాలు చెప్పారని తెలుస్తోంది. రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలని కొందరు కోరితే... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని మరికొందరు సూచించారట. ప్రభుత్వం ఏం చేయబోతోంది, కేసీఆర్ వ్యూహం ఏంటన్నదాని కోసం మరికొన్ని రోజులు ఎదురుచూస్తే బెటరని మరికొందరు నేతలు సూచించారని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంలో ఈటల రాజేందర్ కూడా పునరాలోచన చేస్తున్నారని  తెలుస్తోంది. హైదరాబాద్ కు వెళ్లి మరికొందరు నేతలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేయబోవడం లేదనే ఎక్కువ మంది ఈటల మద్దతుదారులు చెబుతున్నారు. 

తన నియోజకవర్గ నేతలతో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ కూడా ఇదే రకమైన సంకేతం ఇచ్చారు. తనకు జరిగిన అన్యాయం భరించరానిదని కార్యకర్తలు అభిప్రాయపడ్డారని ఈటల రాజేందర్ చెప్పారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు.  రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల ఉద్యమకారులంతా సూచనలు ఇచ్చారన్నారు. 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను కొందరు గుర్తు చేశారని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారని ఈటల తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ నుంచే కాకుండా ఖమ్మం సహా 9 జిల్లాల నుంచీ కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆత్మీయులతో మాట్లాడుతానని.. వాళ్ళతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఆత్మ గౌరవం పెద్ద సమస్య అయ్యిందని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయమని.. అందరూ అర్థం చేసుకోవాలన్నారు. సమస్య వస్తే మీ దగ్గరికే వస్తానని ఈటల వెల్లడించారు. 

By
en-us Political News

  
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.