కేసీఆర్ చీటర్.. ఈటల ఫైర్

Publish Date:Oct 5, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ చీటర్ గా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ కేసీఆర్ వెంట నడిచిన ఈటల తరువాత కేసీఆర్ తో విభేదించి..పార్టీ నుంచి బహిష్కృతుడైన సంగతి విదితమే. 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ ( అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్ ఈటలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆర్థిక శాఖను కేటాయించారు. అయితే 2018లో విజయం సాధించి రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ తన తొలి కేబినెట్ లో ఈటలకు స్థానం కల్పించలేదు. అప్పటికే కేసీఆర్ విధానాలపై ఈటల తన అసంతృప్తి వ్యక్తం చేశారనీ, అందుకే దూరం పెట్టారనీ అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే అనివార్యంగా మంత్రివర్గ విస్తరణలో ఈటలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్నా.. ఆ తరువాత ఆరోపణల నెపంతో ఆయన మంత్రిపదవి నుంచీ, పార్టీ నుంచీ కూడా తొలగించారు. 
అనంతరం ఈటల శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. తన రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానం నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి సత్తా చాటారు. అదే సమయంలో బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. బండి సంజయ్ తో విభేదాలు వచ్చినా, ఒక దశలో కమలం గూటిలో ఈటల ఉక్కపోతకు గురౌతున్నారు, ఆయన ఏ క్షణంలోనైనా బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తారన్న వార్తలు వచ్చినా పార్టీ హైకమాండ్ మాత్రం ఈటలకు మద్దతుగా నిలిచింది. చేరికల కమిటీని ఏర్పాటు చేసి మరీ ఈటలకు ఈ కమిటీ నేతృత్వ బాధ్యతలు అప్పగించింది. 
ఆ తరువాత పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా ఒక విధంగా చెప్పాలంటే అత్యంత కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈటల బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల దాడిని తీవ్రం చేశారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను, వాటిని విస్మరించిన తీరును గుర్తు చేస్తూ  విమర్శల దాడి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్ ను దొంగ వాగ్దానాలతో జనాలను మోసం చేసిన ఛీటర్ గా అభివర్ణించారు. దళితుడిని సీఎం చేస్తానని చేసిన వాగ్దానం, దళిత బంధు కింద పది లక్షల రూపాయలు ఇస్తానంటే చేసిన వాగ్దానాలను కేసీఆర్ విస్మరించారనీ, అలాగే దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి అంటూ వాగ్దానం చేసి ఆ తరువాత భూమి లేదంటూ దానినీ అటకెక్కించేశారనీ.. ఇలా పబ్బం గడుపుకోవడం కోసం వాగ్దానాలు చేయడం ఆ తరువాత వాటిని విస్మరించడం ద్వరా ప్రజలను మోసం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చీటర్ నంబర్ వన్ గా మారానని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు. 

ప్రధాని మోడీపై ఇష్టారీతిన విమర్శలు గుప్పించి మర్యాద తెలియని నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్ బాటలోనే ఆయన కేబినెట్ మంత్రులు కూడా వ్యవహరిస్తున్నారని ఈటల అన్నారు. మాట ఇవ్వడం, తరువాత మరచిపోవడం రివాజుగా మార్చుకున్న కేసీఆర్ విశ్వాస ఘాతుకానికి మారుపేరులా మారితే.. అన్నమాటకు కట్టుబడి విశ్వసనీయతకు మరోపేరుగా మోడీ నిలిచారన్నారు.

కేసీఆర్ ఎన్డీయేలో చేరేందుకు తహతహలాడారన్న మోడీ మాటలను జనం విశ్వసిస్తున్నారనీ, తాను ఎన్డీయేలో చేరేందుకు సంసిద్ధుడైనందునే మోడీ చెప్పిన మాటను కేసీఆర్ ఇప్పటి వరకూ ఖండిం చలేదని ఈటల పేర్కొన్నారు.తెలంగాణ ఆవిర్భావం తరువాత కుటుంబ సమేతంగా అప్పటి కాంగ్రస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన కేసీఆర్ బీఆర్ఎస్( అప్పటికి టీఆర్ఎస్) ను కాంగ్రస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి తప్పిన విషయం నిజం కాదా అని నిలదీశారు.   

By
en-us Political News

  
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.