బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక.. ఈటల మౌనం వెనుక వ్యూహమేంటి?

Publish Date:Jul 1, 2025

Advertisement

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటలకు అవకాశం ఇవ్వకపోవడం ఆయనను అవమానించడమేనన్న భావన ఈటల అనుచరులలో వ్యక్తం అవుతున్నది. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల కాషాయ కండువా కప్పుకున్న సమయంలోనే పలువురు విస్మయం వ్యక్తం చేశారు. వామపక్ష భావజానం ఉన్న ఈటల బీజేపీలో ఇమడటం కష్టమన్న అభిప్రాయాన్ని అప్పట్లోనే పరిశీలకులు వ్యక్తం చేశారు. వారి విశ్లేషణలకు తగినట్లుగానే ఈటల బీజేపీలో ఇమడ లేకపోతున్నారనీ, ఉక్కపోతకు గురౌతున్నారనీ పలు సందర్భాలలో గట్టిగా వినిపించింది.  నిజానికి  వామపక్ష భావజాలం ఉన్న ఈటల  చేరితే కాంగ్రెస్ లో చేరాలి కానీ.. తన భావజాలానికి పూర్తి వ్యతిరేకమైన బీజేపీ కండువా ఎలా? ఎందుకు కప్పుకున్నారన్న ప్రశ్రలు ఉత్పన్నమయ్యయి. అయితే ఈటల మాత్రం పరిశీలకుల విశ్లేషణలను డౌటానుమానాలను పూర్వపక్షం చేస్తూ ఉక్కపోతకు గురైనా, ఇబ్బందులు పడినా బీజేపీలోనే కొనసాగారు. సాగుతున్నారు. ఈ మధ్యలో బీజేపీ అధిష్ఠానం కూడా ఈటల పాపులారిటీనీ, సిన్సియారిటీనీ గుర్తిస్తూ పార్టీలో సముచిత ప్రాధ్యాన్యత ఇస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో పరాజయం పాలైనా.. లోక్ సభ ఎన్నికలలో ఈటలకు మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీకి అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికలలో విజయం సాధించిన ఈటల ఎంపీ అయ్యారు.

అలాగే బండి సంజయ్ ఈటల మధ్య పొడసూపిన విభేదాల సందర్భంలో బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ ను  రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి ఈటలకు మద్దతుగా నిలిచింది.  సరే బండి సంజయ్ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో చేరికల కమిటీని ఏర్పాటు చేసిన బీజేపీ ఆ కమిటీకి చైర్మన్ గా ఈటలను నియమించింది. ఈటల ఆధ్వర్యంలో  బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయనీ... ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయనీ అంతా ఆశించారు. అదలా ఉంటే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల నియామకానికి ముందు పార్టీలో ఈటలకు చాలా చాలా అవమానాలు ఎదురయ్యాయని చెబుతారు.  కానీ ఈటల బీజేపీలో చేరిన క్షణం నుంచి రాష్ట్రంలో ఆ పార్టీ నిర్వహించిన అన్ని కార్యక్రమాలలోనూ భాగస్వామిని చేయడం, అమిత్ షా, మోడీ వంటి అగ్రనేతల సభలలో కూడా వేదికపై ఆసనం ఇవ్వడంతో  ఈటలకు బీజేపీలో ఉక్కపోత అన్న భావన అప్పట్లో పలువురిలో వ్యక్తమైంది.

అయితే బండితో విభేదాలు ఉన్నప్పటికీ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీలో ఈటల గౌరవానికి ఎటువంటి భంగం వాటిల్లలేదు. కానీ కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత మాత్రం ఉద్దేశ పూర్వకంగా ఈటలను తక్కువ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని ఈటల సన్నిహితులు చెబుతూ వస్తున్నారు.  ముఖ్యంగా చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న తాను పార్టీలోకి చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగడంపై ఈటల అప్పట్లోనే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.  మాజీ మంత్రి కృష్ణయాదవ్  పార్టీలో చేరిక అప్పట్లో చివరి క్షణంలో ఆగిపోవడానికి   కిషన్ రెడ్డి కారణమన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీనితో ఈటల ఇక పార్టీలోకి చేరికల విషయంలో ఎటువంటి ప్రయత్నాలూ చేయడం లేదని అంటున్నారు. అలాగే.. ఈటల ద్వారా పార్టీలోకి స్పష్టమైన హామీతో చేరిన తుల ఉమ వంటి వారికి పోటీగా ఇతరులను తీసుకురావడం వంటి ఘటనలతో ఈటల పార్టీ వ్యవహారాలలో పెద్దగా పాల్గొనకుండా అంటీముట్టనట్లు వ్యవహిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మొత్తం మీద కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీలో పరిస్థితి ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా ఉందని పార్టీ వర్గాలే చెప్పేపరిస్థితికి విభేదాలు పెచ్చరిల్లాయి. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుని ఎన్నికపై చర్చ సందర్భంగా ఈటలకు పార్టీ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చిందనీ, కానీ చివరిక్షణంలో హాత్ ఇచ్చి రామచంద్రరావును ఎంపిక చేయడంపై ఆయన వర్గీయులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కాగా రామచంద్రరావుకు తెలంగాణ పార్టీ బాధ్యతలను అప్పగించడంపై ఈటల ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. 

By
en-us Political News

  
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.