ఏపీ బడ్జెట్.. అభివృద్ధి, సంక్షేమాలకు సమప్రాధాన్యత

Publish Date:Feb 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను శనివారం (ఫిబ్రవరి 14) అసెంబ్లీలో  ప్రవేశపెట్టనున్నారు. 3.46 లక్షల కోట్ల రూపాయలతో  సరిగ్గా ఉదయం పదకొండు గంటల పదిహేను నిముషాలకు వార్షిక పద్దును పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశ పెడతారు. అంతకు మందు పదిన్నర గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. పయ్యావుల బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇక సభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. ఇక మండలిలో బడ్జెట్ ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ బడ్జెట్ ను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశ పెడతారు. 

ఇలా ఉండగా పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఇది మూడో సారి. ఓటాన్ అక్కౌంట్ ఒకసారి, పూర్తి స్థాయి బడ్జెట్ ను ఒక సారి ప్రవేశపెట్టిన ఆయన.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.  పయ్యావుల పద్దులో అభివృద్ధి- సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల అమలుకు ఇతోశిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.   ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజలకు లబ్ది కలిగేలా బడ్జెట్ రూపొందించినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. . బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి 10 రోజుల ముందు నుంచి ఆయన  వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శుల నుంచి   ప్రతిపాదనలు స్వీకరించారు.  

ఇలా ఉండగా పయ్యావుల కేశవ్ ఈ రోజు సభలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో రైతులు, మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా విత్తమంత్రి పయ్యావుల బడ్జెట్ రూపొందించారని అంటున్నారు. సూపర్ సిక్స్ హామీల  అమలుతో పాటు ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తూనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికీ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.