మూర్ఛ వ్యాధి లైఫ్ స్టైల్ ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

Publish Date:Jul 18, 2022

Advertisement

మనిషిని అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని తాత్కాలిక ఉపశమనం తప్పితే శాశ్వత పరిష్కారం లేకుండా ఉంటాయి. దీర్ఘకాలిక మందుల వాడకం వల్ల  తగ్గే అవకాశాలు ఉంటాయేమో కానీ అది కొద్దిశాతం మాత్రమే. వయసుతోను, జెండర్ తోనూ సంబంధం లేకుండా సమయం అంటూ లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టె సమస్య మూర్ఛ రోగం. ఇది నరాల సంబంధ సమస్య వల్ల వస్తుంది.  ప్రపంచంలో  అందరినీ ఇబ్బంది పెడుతున్న నరాలకు సంబంధించిన నాలుగవ సమస్యగా మూర్చరోగం నమోదయింది.

మూర్చరోగానికి సంబంధించిన ఒక అధ్యయనంలో మెదడు పనితీరు గురించి ఒక విషయాన్ని తెలుసుకున్నారు. మూర్ఛ రోగులు నిద్రపోతున్న సమయంలో బయటి శబ్దాలకు స్పందించే లక్షణం సాధారణ వ్యక్తులకంటే ఎక్కువగా ఉంటుందట. అల్ఫా-బీటా తరంగాల స్థాయి వల్ల ఇందులో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం కూడా ఉంటుంది.

అసలు సమస్య ఎక్కడ?? ఏంటి?

అల్ఫా-బీటా తరంగాలు క్షీణించిపోయి తక్కువ స్థాయిలో ఉంటే శబ్దాలకు స్పందించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గుణం వల్ల తరువాత ఏమి జరుగుతుందో అనే ఆలోచనా వలయం మెదడులో క్రమంగా పెరిగిపోతుందట. ఈ కారణం వల్ల మూర్ఛ రోగులు రాత్రి సమయాల్లో మెలకువ వచ్చి లేస్తే తరువాత నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడతారు.

మూర్ఛ రోగులలో మెదడులోని న్యూరాన్ లు వీణ మీద తీగల్లాగా ప్రవర్తిస్తాయి. అవి ఒక్కసారి కంపనానికి లోనైతే ఇక వాటి తాలూకూ శబ్దాన్ని రీసౌండ్ చేస్తున్నట్టు ఉంటాయి. మనిషి మానసిక పరిస్థితిని బట్టి వాటి శబ్ద తీవ్రత అనుభూతి చెందడంలో చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కుంటారు.

◆ ఈ పరిస్థితులు ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయాలను  పరిశోధకులు దగ్గరగా పరిశోధించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. పరిశోధనలో మెదడులో కొన్ని ఎలాక్ట్రోడ్ లు అమర్చి లోపలి పనితీరు వ్యవస్థను గమనించినప్పుడు ఆశ్చర్యంగా మూర్ఛ సమస్య ఉన్న వాళ్లలో మెదడు కణాలు అన్నీ ఒకే విధంగా స్పందించాయి.

7 సంవత్సరాలలో సుమారు 700 మంది నుండి న్యూరాన్ ల డేటా ను సేకరించి పరిశీలించిన ఫలితాలలో మెదడు కణాలు నిద్రలో చాలా తీవ్ర స్థాయిలో స్పందించాయని తెలుసుకున్నారు.

 అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ పరిశోధనలు, వాటి ఫలితాలు, బాధితుల అనుభవాలను గమనిస్తే ఈ మూర్ఛ వ్యాధి అనేది మనుషులను ఎంతగా ఇబ్బంది పెడుతోందో అర్థం చేసుకోవచ్చు.

పరిష్కారం ఎలా?

ఇది పూర్తిగా నరాల సంబంధిత సమస్య. కొన్ని జన్యు పరంగానూ ఉండచ్చు, మరికొన్ని అకస్మాత్తుగా సంభవించేవి కావచ్చు.  కొంతమందిలో ప్రమాదాలు జరిగినప్పుడు ఈ మార్చ వ్యాధి అటాక్ అవ్వచ్చు, మహిళల్లో ప్రసవ సమయంలో ఈ సమస్య ఎదురవ్వచ్చు. దీనికి స్వీయ పరిష్కారం ఏదైనా ఉందంటే అది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. నరాలను ఒత్తిడిలోకి నెట్టే ఆలోచనలు, శారీరక శ్రమ ఎక్కువ చేయకుండా ఉండటం మంచిది. జీవన విధానాన్ని ఆహ్లాదంగా ఉంచుకోవడం.

నరాలకు శక్తిని ఇచ్చే ఆహారపదార్థాలు తీసుకోవాలి. నువ్వులు, నువ్వుల నూనె ఎంతో మంచివి.

సహజసిద్ధమైన జీవన విధానానికి దగ్గరగా ఉండాలి. తిండి, నీరు, గాలి, నివసించే వాతావరణం విషయంలో జాగ్రత్తలు అవసరం.

కుటుంబ సభ్యుల నుండి సహకారం అవసరం అవుతుంది. అనవసరపు గొడవలకు, రాద్ధాంతాలకు దూరం ఉండాలి. ముఖ్యంగా ఎమోషన్స్ ను బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోవడం కుటుంబ సభ్యుల కర్తవ్యం.

ఇవన్నీ కేవలం జాగ్రత్తలు మాత్రమే. వైద్యులను సంప్రదించి మందులు వాడటం మంచి మార్గం. ఇలా చేస్తుంటే జీవన విధానంలో మూర్ఛ అనే సమస్య ప్రభావం కాసింత తక్కువే ఉంటుంది.


                                         ◆వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.