Publish Date:Jul 22, 2024
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో ఒకదాని తరువాత ఒకటిగా వివాదాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాను ఎప్పుడో 2016లోనే తమ కులాచారం ప్రకారం మదన్ మోహన్ కు విడాకులు ఇచ్చేశానని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించిన శాంతి.. తాను లాయర్ సుభాష్ రెడ్డిని 2020లో వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే 2016లోనే విడాకులిచ్చిన మదన్ మోహన్ పేరునే 2020లో దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరే సమయంలో భర్తగా పేర్కొన్నారు. ఆమె సర్వీస్ రిజిస్టర్ లో కూడా అదే ఉంది. అంతే కాదు.. గత ఏడాది జనవరిలో మెటర్నటీ లీవ్ కోసం చేసుకున్న దరఖాస్తులో కూడా శాంతి తన భర్త పేరు మదన్ మోహన్ అనే పేర్కొన్నారు. కానీ ఇటీవల అంటే జులై 17న.. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మదన్ మోహన్ తన భార్య శాంతికి విజయసాయిరెడ్డితో సంబంధం ఉందనీ, ఆమెకు పుట్టిన మగబిడ్డకు ఆయనే తండ్రి అంటూ ఫిర్యాదు చేసిన తరువాత.. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మదన్ మోహన్ కు తాను ఎప్పుడో విడాకులు ఇచ్చేశాననీ, పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.
దీంతో విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకున్న శాంతి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ 15 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ సస్పెన్షన్ లో ఉన్న సహాయ కమిషనర్ కె.శాంతికి ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసు జారీ చేశారు. అంతే కాకుండా ఆమెపై కొత్తగా ఆరు అభియోగాలు నమోదు చేశారు. శాంతి ఇప్పటికే అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ లో ఉన్నారు. సస్పెన్షన్ ఉన్న శాంతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రస్తావించిన అంశాలతో పాటు, ఎటువంటి అనుమతీ లేకుండా మీడియాతో మాట్లడటం సహా పలు ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా ఆమెపై ఆరు అంశాలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ అయ్యాయి.
తాజాగా వివరణ కోరుతూ జారీ చేసిన నోటీలులో విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పి, వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడం, దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించడం, కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లడటం అలాగే.. వైసీపీ ఎంపీను ప్రశంసిస్తూ ట్వీట్ చ చేయడం , అలాగే విశాఖలో ఆమె నివాసం ఉన్న అపార్ట్ మెంట్ లోని వేరే ప్లాట్ వారితో గొడవపడి పోలీసు స్టేషన్ కు ఎక్కడం వంటి అంశాలపై వివరణ కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ నోటీసు చారీ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/endowment-commissioner-issue-notice-to-shanti-39-181198.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.