బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్.. తిరుపతి ఘటనపై అసత్య ప్రచారాలకు ఎండ్ కార్డ్

Publish Date:Jan 13, 2025

Advertisement

తిరుమ‌ల‌లో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమ‌ల‌కు వ‌స్తుంటారు. ప్ర‌తీ రోజూ దాదాపు అర‌వై వేల‌కుపైగా భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. తిరుమల నిత్యం  స్వామినామ‌స్మ‌ర‌ణంతో మారుమోగిపోతుంది. అలాంటి తిరుమ‌ల‌లో గ‌డిచిన ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో ఎన్నో అప‌చారాలు జ‌రిగాయి. ల‌డ్డూ త‌యారీలో వాడే నెయ్యి విష‌యం ద‌గ్గ‌ర నుంచి.. తిరుమ‌ల‌లో టికెట్ల పంపిణీ.. ఉద్యోగుల నియామ‌కం ఇలా అన్నిఅంశాల్లోనూ వైసీపీ హ‌యాంలో అనేక త‌ప్పులు జ‌రిగాయి. మొత్తంగా తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీసే స్థాయికి గ‌త పాల‌కుల నిర్ణ‌యాలు వెళ్లారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో అధికారులు తిరుమ‌ల ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల‌ను ఒక్కొక్క‌టిగా స‌రిచేసుకుంటూ వ‌స్తున్నారు. దీంతో తిరుమ‌ల‌ను ద‌ర్శించుకునే భ‌క్తుల తాకిడి క్ర‌మంగా మరింత పెరుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా టోకెన్ల జారీ స‌మ‌యంలో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న‌లో ఆరుగురు మ‌ర‌ణించ‌గా.. ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు జ‌గ‌న్, వైసీపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు.

తిరుప‌తిలో టోకెన్ల పంపిణీ స‌మ‌యంలో ఆరుగురు మృతిచెంద‌డం చ‌రిత్ర‌లోనే తొలిసారి. ఒక‌రిద్ద‌రు అధికారుల కార‌ణంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే, ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే టీడీపీ పాల‌క మండ‌లి అప్ర‌మ‌త్త‌మైంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం వెంట‌నే స్పందించారు. ఘ‌ట‌న జ‌రిగిన కొన్నిగంట‌ల‌కే వారు తిరుప‌తికి వ‌చ్చి క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించి.. ప్ర‌మాదం జ‌రిగిన తీరుపై అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో అధికారుల‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రాథ‌మిక విచార‌ణ‌లో ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిలను సస్పెండ్ చేయ‌డంతోపాటు.. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌లను బ‌దిలీ చేశారు. గాయ‌ప‌డి ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారివ‌ద్ద‌కు వెళ్లిన చంద్ర‌బాబు.. వారిని ప‌రామ‌ర్శించి ఘ‌ట‌న జ‌రిగిన తీరును తెలుసుకున్నారు. అంతేకాక మ‌రుస‌టిరోజే వారికి ప్ర‌త్యేక వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం ఏర్పాటు చేయించారు.

అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. క్ష‌త‌గాత్రుల ప‌రామ‌ర్శ పేరుతో ఆస్ప‌త్రికివ‌చ్చిన జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తించారు. ఒక‌రిద్ద‌రే రావాల‌ని వైద్యులు వారించినా విన‌కుండా జ‌గ‌న్ స‌హా మ‌రో ప‌దిమంది వైసీపీ నేత‌లు లోప‌లికి వెళ్లారు. దీనికితోడు జ‌గ‌న్ వ‌చ్చే ముందే ప‌లువురికి ఓ వైసీపీ నేత‌ తెల్లక‌వ‌ర్లు పంచిపెట్ట‌డం సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌టంతో వైసీపీ కుట్ర‌కోణం బ‌య‌ట‌కొచ్చింది. క‌వ‌ర్లో డ‌బ్బులిచ్చి చంద్ర‌బాబు వ‌ల్ల‌నే ఆ ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్పించే ప్ర‌య‌త్నం చేసింది వైసీపీ బ్యాచ్‌. చంద్ర‌బాబు స‌కాలంలో స్పందించ‌డంతో ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా వాడుకోవాల‌న్న వైసీపీ ప్లాన్ బెడిసికొట్టింది. 

అబ‌ద్ధాల‌ను ప‌దేప‌దే ప్ర‌చారం చేసి అవి నిజ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా చేయ‌డంలో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు దిట్ట‌. దీనికి తోడు జ‌గ‌న్ సొంత మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియా ఉండ‌నే ఉంది. ఘ‌ట‌న జ‌రిగిన తొలి రెండు రోజులు చంద్రబాబు కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగిందంటూ వైసీపీ మీడియా ప్ర‌చారం చేసింది. వారి ప్లాన్ బెడిసికొట్ట‌డంతో ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం చైర్మ‌న్‌, ఈవో అంటూ ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టింది వైసీపీ బ్యాచ్‌.  చైర్మ‌న్‌, ఈవో మ‌ధ్య సమన్వయ లోపం, విభేదాలే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని సొంత జగన్ మీడియా, సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం చేశాయి. చైర్మ‌న్‌, ఈవోకు వేంక‌టేశ్వ‌ర స్వామి అంటే భ‌క్తిలేదని, తిరుమ‌ల‌లో రాజ‌కీయాలు చేస్తున్నారంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేశాయి. తాజాగా వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారాల‌పై టీటీడీ చైర్మ‌న్‌, ఈవో మీడియా స‌మావేశం పెట్టి సీరియ‌స్ అయ్యారు. టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని స్ప‌ష్టం చేశారు. దీంతో వైసీపీ అస‌త్య ప్ర‌చారాల‌కు ఎండ్ కార్డు ప‌డిన‌ట్ల‌యింది.

By
en-us Political News

  
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని సూగూరు గ్రామంలో దాదాపు 400 సంవత్సరాల కిందట సూగూరు సంస్థానా దీశులు నిర్మించిన వైష్ణవాలయాన్ని భద్రపరచి పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన, ... తిరుమలలో అగ్నిప్రమాదంపై విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్‌ ఆశిష్‌ గవాయ్‌ ఓవర్ యాక్షన్ చేశారు. తిరుమల ఘటనలపై తమకు ఫిర్యాదులు అందాయని పేర్కొంటూ టీటీడీలో క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌, భద్రతా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ అదనపు డైరెక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ జిందాల్‌ సమీక్ష నిర్వహిస్తారనీ, ఆది సోమవారాల్లో (జనవరి 19, 20) ఆయన తిరుమలలో పర్యటించి సమీక్షించి కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తారనీ పేర్కొంటూ అధికారిక లేఖ రాశారు.
పెబ్బేరు మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిడ్జి రంగాపూర్ లోని ఓటి గుడిని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ సంస్థ ముందుకు వచ్చింది. పెట్టుబడుల ఆకర్షణే ద్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ దృష్టిసారించింది. ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, అలాగే 13న లడ్డూ విక్రయ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటలపై టీటీడీని వివరణ కోరింది.
నాగర్ కర్నూలు జిల్లాలో మండల కేంద్రమైన కొల్లాపూర్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లూరులో కాకతీయుల కాలపు అరుదైన వీరగల్లును గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు,ప్లిచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో శివ నాగిరెడ్డి, వెన్నెల సాహిత్య అకాడమీ ముచ్చర్ల దినకర్, చరిత్ర పరిశోధకుడు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు డాక్టర్ భైరోజు శ్యామసుందర్ తెలిపారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో శనివారం ఎస్ నె క్ట్స్ జెన్ సంస్థ ప్రతినిధులను ఎసిబి విచారణ చేసింది. ఈ సంస్థ డైరెక్టర్ అనిల్ విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు విచారణ చేశారు.
ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేదు. ఈ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అన్న బేధం లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పుట్టి మునిగిపోతోంది. ఆ పార్టీ నుంచి వలసల వరద వెల్లువెత్తుతోంది. ఆ వలసల వరద ధాటికి వైసీపీ గేట్లు పగిలిపోతున్నాయి. జగన్ తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోతున్నాయి.
మంచు మోహన్ బాబు ఇంట్లో రోజుకో ట్విస్ట్ చేసుకుంటుంది.  తన కష్టార్జితమైన రంగా రెడ్డి జిల్లా జల్ పల్లి నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని గతంలో మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్ , కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
తిరుమలలో శనివారం (జనవరి 18) 9వ రోజు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. గత ఎనిమిది రోజులలో తిరుమలేశుని వైకుంఠ ద్వారం ద్వారా మొత్తం 5లక్షల 36 వేల 277 మంది దర్శించుకున్నారు.
ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని నారా భువనేశ్వరి చెప్పారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహా నటుడు, ప్రజానాయకుడు ఎన్టీఆర్ అని నారా భువనేశ్వరి అన్నారు.
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు ఇది తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనసా వాచా కర్మణా నమ్మి ఆచరించిన సిద్ధాంతం. రెండు రూపాయలకే కిలోబియ్యం.. పేదలకు జనతా వస్త్రాలు.. పేదలకు పక్కా ఇళ్లు.. వృద్ధులకు పెన్షన్ ..ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. రాజకీయ చైతన్యాన్ని జనక్షేత్రానికి తీసుకువెళ్లిన ఘనత ఆయనదే. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎన్టీఆర్ చూపిన సంక్షేమ మార్గాన్నే అనుసరిస్తోంది.
దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయిన  కోల్‌కతాలో ఆర్జీకర్‌ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచార కేసులో బంగాల్‌లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది.  గత ఏడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.