తెలుగుదేశంలో యనమల శకానికి ఎండ్ కార్డ్?!

Publish Date:Mar 10, 2025

Advertisement

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం ముగ్గరు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలకు జరుగుతుండగా.. వాటిలో ఒక స్థానాన్ని జనసేనకు తెలుగుదేశం కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి ఇప్పటికే జనసేన సీనియర్ నాయకుడు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇక మిగిలిన నాలుగు స్థానాలలో ఒక స్థానాన్ని అనూహ్యంగా బీజేపీకి కేటాయించిన తెలుగుదేశం.. మిగిలిన మూడు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది.

వాటిలో ఒకటి ఎస్సీకి, మిగిలిన రెండూ బీసీలకూ కేటాయించింది. ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల కేటాయింపులో సామాజిక సమన్యాయాన్ని పాటించిన తెలుగుదేశం.. బీసీలకు రెండు స్థానాలు కేటాయించినప్పటికీ, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న యనమలకు టికెట్ కేటాయించలేదు. ఎమ్మెల్సీగా ఆయనను కొనసాగించేందుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ యనమలను పక్కన పెట్టింది. అదే సమయంలో బీటీ నాయుడిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

సహజంగానే ఈ నిర్ణయం పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే యనమలకు ఎందుకు ఇవ్వలేదన్న చర్చ కాకుండా, తనకు టికెట్ దక్కకపోవడంపై యనమల ఎలా రియాక్ట్ అవుతారా అన్న అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాస్తవానికి చంద్రబాబు తన కేబినెట్ లో యనమలకు అవకాశం ఇవ్వకపోవడంతో.. ఇప్పటికే యనమల ఒకింత అసంతృత్తితో ఉన్నారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత  కాకినాడ పోర్టు విషయంలో  తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాన్ని, అనుసరించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ యనమల కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆయన పార్టీకి దూరం జరుగుతున్నారా అన్న అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తం అయ్యాయి.

ఇక ఇప్పుడు తాజాగా ఆయనకు ఎమ్మెల్సీగా మరో అవకాశం ఇవ్వకపోవడంతో యనమల ఎలా రియాక్ట్ అవుతారన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన  తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్ల ఖరారును స్వాగతించారు. . బడుగు వర్గాలకు.. అందునా యువతకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల యనమల హర్షం వ్యక్తం చేశారు.   యనమల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవీ లేకుండా ఉండడం ఇదే తొలిసారి. 1982 నుంచి తాజాగా 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచేంత వరకు ఏదో కొద్ది కాలం మివహా యనమల ఏదోక  కెబినెట్ ర్యాంకులోనే కొనసాగుతూనే వచ్చారు. ఇప్పుడు ఆయనకు ఏ పదవీ ఇవ్వకపోవడంతో ఆయన శకం ఇక టీటీపీలో ముగిసినట్లేనా అన్న అనుమానాలు పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.