అంతా ఓకే ... ఏకగ్రీవానికి లైన్ క్లియర్

Publish Date:Mar 10, 2025

Advertisement

శుభం. తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు శుభం కార్డ్ పడింది. ఐదుకు ఐదు స్థానాలు ఏకగ్రీవం అయ్యేందుకు, వీలుగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ సానుకూల నిర్ణయం తీసుకున్నాయి. పోటీకి అవకాశం ఉన్నా, ఎందుకనో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ, ఏకగ్రీవానికే  ఓకే చెప్పాయి. నిజానికి, బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలు అటో , ఇటో తేల్చేందుకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉభయ పార్టీలకు మంచి అవకాశంగా భావిచారు. ముఖ్యంగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్, రెండవ అభ్యర్ధిని బరిలో దించి, విప్ జరీ చేస్తుందని అందరూ భావించారు. అయితే, వచ్చిన అవకాశాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ వదులుకున్నాయి. ఉభయ పార్టీల మధ్య అలాంటి లోపాయికారీ ఒప్పందం కుదిరిందో ఏమో కానీ,,  గప్ చిప్ గా  సర్దుకు పోయారు. ఐదు సీట్లను సర్దేసుకున్నారు.  

కాగా, ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో, అసెంబ్లీలో ఉన్నసంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి, ఫిరాయించిన ఎమ్మెల్యేల బలంతో కలుపుకుంటే,  ఖాయంగా నాలుగు స్థానాలు గెలిచే అవకాశం వుంది. కాగా, కాంగ్రెస్  నాలుగు స్థానాలలో ఒక స్థానాన్ని మిత్ర పక్షం సిపిఐకి వదిలి, మిగిలిన మూడు స్థానాలకు తమ అభ్యర్ధులను నిలిపింది. మరో వంక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎగ్గులకు పోకుండా, ఖాయంగా గెలిచే ఒక్క సీటుకే పరిమితం అయింది. మూడు పార్టీలూ అభ్యర్ధులను ప్రకటించాయి. 

కాంగ్రెస్ పార్టీ, సామాజిక న్యాయాన్ని పాటిస్తూ, విశ్వసనీయత, విశ్వాసాలకు పెద్ద పీట వేస్తూ, ఎస్సీఎస్టీ, మహిళ కు టికెట్లు ఇచ్చింది. పార్టీ నాయకత్వం పట్ల  సంపూర్ణ విశ్వాసంతో, విశ్వసనీయంగా పనిచేస్తున్న అద్దంకి దయాకర్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర  నాయక్తో పాటుగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎంపీ  విజయశాంతికి టికెట్ ఇచ్చింది.అలాగే బీఆర్ఎస్ కూడా చట్ట సభలో సీటు కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న దాసోజు శ్రవణ్ కు టికెట్ ఇచ్చింది. పార్టీలు వేరైనా, దయాకర్, శ్రవణ్ మధ్య ఒక సారూప్యత కూడా వుంది. ఇద్దరికీ  చట్ట సభల ఎంట్రీ పాస్  చిక్కినట్లే చిక్కి చేజారి పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరికీ ఒకేసారి చట్టసభలో ప్రవేశించే అవకాశం రావడం యాదృచ్చికమే అయినా, ఆసక్తిని రేకేతిస్తున్నది. అలాగే ఆ ఇద్దరి విషయంలో ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు కూడా ఉండక పోవచ్చును. ఇద్దరూ డాక్టరేట్ పట్ట పొందిన విద్యా  వంతులు, ఉద్యమ నేపధ్యం నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, అలా ఎలా చూసినా  పెద్దల సభకు అన్నివిధాలు అర్హులు. అందులో సందేహం లేదు.  

అలాగే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నా సిపిఐ కి పొత్తు ఒప్పందంలో భాగంగా దక్కిన ఎమ్మెల్సీ సీటుకు నల్గొండ జిల్లా కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లికంటి సత్యంకు టికెట్ ఇచ్చింది. కాగా  కాంగ్రెస్ కోటాలో టికెట్ దక్కించుకున్న నలుగురిలో ముగ్గురు  ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారు కావడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ తొలి సారిగా  ఓసీలను కాదని ఎస్సీ ఎస్టీ, బీసీ మహిళకు టికెట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకిస్తోంది. అలాగే బీఆర్ఎస్, సిపిఐ కూడా, బీసీలకు టికెట్, ఇవ్వడం ఒక విధంగా రాష్ట్రంలో మారుతున్న సామాజిక ప్రాధాన్యతలకు నిదర్శనంగా భావిస్తున్నారు.ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాల ప్రభావం అన్ని పార్టీల మీద ఉందనేందుకు ఏ ఒక్క పార్టీ కూడా, ముఖ్యంగా నల్గొండ నుంచి అభ్యర్ధులను బరిలో దించిన కాంగ్రెస్, సిపిఐ పార్టీలు రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టికెట్లు ఇవ్వడం రాజకీయ సామాజిక సమీకరణాలలో వస్తున్న మార్పుకు సంకేతంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే, మొత్తం ఐదుగురిలో నలుగురు ఒకే జిల్లాకి చెందినా వారు కావడం కూడా బాహుశా ఇదే ప్రప్రథమం కావచ్చును. 

అదొకటి అలా ఉంటే కాంగ్రెస్ అధిష్టానం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసి అధ్యక్షుడు మహేశ కుమార్ గౌడ్ సహా రాష్ట్ర నాయకులను సిఫార్సులకు మాత్రమే పరిమితం చేసిందనే ప్రచారం జరుగుతోంది. అందులో నిజం వుందో లేదో కానీ, ఫైనల్ స్కృటినీ, చివరి వడపోత సమయంలో రాష్ట్ర నాయకులు ఎవరూ ఢిల్లీలో లేరు. నిజానికి  ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం, అధిష్టానం ఆదేశం మేరకు చివరి నిముషంలో రద్దయింది. దీని బట్టి చూస్తే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకులకు, గీత దాటద్దని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు అర్థమవుతోందని అంటున్నారు. ముఖ్యంగా, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నియామకం అనతరం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని పెట్టిందనే వాదనకు, ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో పార్టీ అధిష్టానం అనుసరించిన, ప్రక్రియ అద్దం పడుతొందని అంటున్నారు. ఈ నేపధ్యంలో అభ్యర్ధుల ఎంపికలో, ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుడు, జానా రెడ్డికి, అధిష్టానం  ఇచ్చిన ప్రధాన్యత దృష్ట్యా, ముందు ముందు మరిన్ని సంచలన నిర్ణయాలు, ‘ముఖ్య’ మైన  మార్పులు  ఉన్నా ఉండవచ్చని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. 

మొత్తంగా చూస్తే, తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగా నిలిచిన, మిలియన్ మార్చ్’  జరిగిన, మార్చి 10 (2011) రోజున, తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్, విజయశాంతి పెద్దల సభకు నామినేషన్ వేయడం ... వారి ఏకగ్రీవ ఎన్నిక ఇంచుమించుగా ఖరారు కావడం ఒక విధంగా స్వాగతించదగిన పరిణామంగా ఉద్యమ నాయకులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.