Publish Date:Mar 29, 2025
వరుస ఎన్ కౌంటర్లతో ఛత్తీస్ గఢ్ దద్దరిల్లిపోతున్నది. తాజాగా శనివారం (మార్చి 28) ఉదయం చత్తీస్గఢ్ లోని దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దండకారణ్యంలో శనివారం (మార్చి 28) ఉదయం కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్యా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
గోగుండా హిల్ పై మావోయిస్టుల కదలికలకు సంబంధించి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ జరిపాయి. ఆ సందర్భంగా కెర్ల పాల్ పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతా దళాలను గమనించగానే ముందుగా మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రతిగా భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పులలో 15 మంది నక్సలైట్లు హతమయ్యారు. ఎదురు కాల్పులు ఇంకా జరుగుతున్నాయి. ఈ కూంబింగ్ ఆపరేషన్ లో డిస్ట్రిక్ట్ రిజర్వ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ లు పాల్గొన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/encounter-in-chattisghar-15-naxals-dead-25-195201.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.