Publish Date:Mar 20, 2025
ఛత్తీస్గఢ్ లో గురువారం మార్చి ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో 22 మందిమావోయిస్టులు హతమయ్యారు. రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని గంగలూరు ఆంఢ్రీ అడవులలో ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఒక జవాన్ కూడా మరణించినట్లు చెబుతున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుగుతుండటంతో తరచూ ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.
వచ్చే ఏడాది మార్చి కల్లా దేశాన్ని నక్సల్ ముక్త దేశంగా చూడాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఏడాది జనవరి 6న ప్రకటించారు. అప్పటి నుంచే దండకారణ్యంలో పోలీసు యాక్షన్ ముమ్మరమైంది. కూంబింగ్ ఆపరేషన్ ఎడతెగకుండా సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి9న జరిగిన భారీ ఎన్ కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.
తాజాగా గురువారం (మార్చి 20) ఉదయం కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్యా కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరుణించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దేశంలో మావోయిస్టు పార్టీలను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథంలో భాగంగా గత ఏడాది జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు 300లకు పైగా మావోయిస్టులు హతమైనట్లు కేంద్ర హోంశాఖ అధికారులు చెబుతున్నారు.
కాగా తాజా ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పోస్టులో మన సైనికులు నక్సల్ ముక్త భారత్ అభియాన్ దిశగా ఒక గొప్ప ముందడుగు వేశారని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన విధానంతో ముందుకు సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుంది. అనే పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/encounter-in-chattisghad-39-194746.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.