రాష్ట్రంలో అధికారులకు ఇదేం ఖర్మ?

Publish Date:Nov 26, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారులు, ఉద్యోగులతో తమ పార్టీ ఎన్నికల ప్రచారం చేపడుతున్నది. వై జ‌గ‌న్ నీడ్స్ ఏపీ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) అనే కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన వైసీపీ,  ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేతలతో కాకుండా ప్రభుత్వ అధికారులతో జరిపిస్తున్నది. నవంబర్ 9 నుండి ఈ కార్య‌క్ర‌మం క్షేత్ర‌స్థాయిలో అన్ని జిల్లాల‌లో మొదలైంది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఒక్కరూ కనిపించడం లేదు. ఎక్కడిక్కడ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇతర రెవెన్యూ ఉద్యోగులు ప్రజల వద్దకు వెళ్లి జగనే మళ్ళీ ఎందుకు కావాలో వివరిస్తున్నారు. అధికారులు, ఉద్యోగులు ప్రజల వద్దకు వెళ్లి నాలుగున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం గురించి వివరించి..  ఈ పథకాలన్నీ ఉండాలంటే జగనే మళ్ళీ సీఎం కావాలని చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకూ ఒక్కో తలకి ఎంత సంక్షేమం అందించారో ప్రజలకు తెలియజేసి వారి ఇంటిపై వైసీపీ జెండా ఎగరేయాలని.. ఇంటికో జెండా కూడా పంచిపెడుతున్నారు.

అయితే  ఇలా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారం చేయించుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. జగన్ సర్కార్ ఇంత అడ్డగోలుగా ప్రభుత్వ అధికారులను రాజకీయ ప్రచారానికి వాడుకొనే నిర్ణయం తీసుకోవడాన్ని మేధావులు, పలువురు రిటైర్డ్ అధికారులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక జిల్లా యంత్రాంగం మొత్తాన్ని నడిపే ఐఏఎస్ అధికారి లేదా అధికారిణిని సీఎం జగన్ చివరికి ఒక పార్టీ కార్యకర్తగా మార్చేశారంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులతో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు భారీగా ఖర్చు చేయడం అంటే ప్రజల సొమ్ము సొంతానికి వాడుకుంటూ దుర్వినియోగం చేయడమే అవుతుందని అంటున్నారు. కలెక్టర్ నుండి వాలంటీర్ వరకూ అందరికీ జీతాలుగా అందేది  ప్రజల సొమ్మే. కానీ వారితో ఇలా పార్టీ ప్రచారం చేయించడం అంటే అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

ప్రభుత్వ అధికారులంటే కేవలం ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాలి. పౌరుడు ఏ పార్టీ కార్యకర్త అయినా, ఏ పార్టీ సానుభూతిపరుడైనా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా అమలు చేయాలి. అలాగే ఏ పార్టీకీ ప్రచారం చేయకూడదు. అధికార పార్టీకి  అయినా  సరే లబ్ది చేకూరేలా ప్రవర్తించకూడదన్నది రాజ్యాంగం విస్పష్టంగా చెబుతోంది. కానీ, ఏపీలో మాత్రం వైసీపీ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రభుత్వ ఉద్యోగులను సొంత పార్టీ ప్రయోజనాలను  అడ్డగోలుగా వాడేసుకుంటోంది.  ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ప్రజలలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిన్న మొన్నటి వరకూ ప్రజల వద్దకు వెళ్లిన వైసీపీ నేతలను ప్రశ్నించిన ప్రజలు.. ఇప్పుడు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ?, సబ్సీడీలు ఎందుకు ఆపేశారు? ఉపాధి ఏమైంది? అంటూ ప్రశ్రిస్తున్నారు. నిలదీస్తున్నారు. అసలు మీరెందుకు ప్రచారం చేస్తున్నారంటూ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.  కానీ, అధికారులు తమకేమీ తెలియదని.. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని సమాధానమిస్తున్నారు.

అయితే, అసలు పార్టీ ప్రచారానికి అధికారులను వాడుకోవాల్సిన దుస్థితి వైసీపీకి ఎందుకొచ్చింది? చట్టాన్ని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఇంత గుడ్డిగా అమలు చేయాల్సిన అవసరం ఏముందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. నిజానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ప్రజల మధ్యకి వెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.  ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు నేతల మొహం మీదనే అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. దీంతో వైసీపీ తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కాదని అధికారుల పార్టీ ప్రచారం కోసం ప్రజల వద్దకు పంపిస్తోంది. అయితే ఈ విధానాన్ని  వ్యతిరేకించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా ప్రభుత్వం చెప్పినట్లు ఆడడం, ప్రభుత్వ సేవలో తరించేందుకు సిద్ధపడిపోవడం విస్తుగొల్పుతోంది.   సంఘాలు, కమిటీలతో దేన్నైనా వ్యతిరేకించే ఉద్యోగులు ఇలా అధికార పార్టీ ప్రచారం కోసం నిస్సహాయంగా ప్రజల చీదరింపులను భరించడానికి కూడా వెరవకపోవడం వారి దైన్యస్థితికి అద్దం పడుతోంది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులలో కూడా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది. దానికి తోడు ఇప్పుడు ఇలా తమతో బలవంతంగా పార్టీ ప్రచారం చేయడాన్ని వారు  ర్ణించుకోలేకపోతున్నారు. పంటిబిగువన అసంతృప్తిని, ఆగ్రహాన్ని దాచుకుని గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ సర్కార్  ఆడమన్నట్లల్లా ఆడుతున్నామని వారు ప్రైవేటు సంభాషణల్లో దాపరికం లేకుండా చెబుతున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.