ప్రపంచ దేశాలను ఎల్ నినో బెంబేలెత్తిస్తున్నది. ఈ ఏడాది ఎల్ నినో పభావం ఊహించిన దానికంటే భయంకరంగా, బలంగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఓ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా వేగంగా పెరుగుతున్నాయని.. ఇది రాబోయే విపత్తుకు విస్పష్ట సంకేతమని ఐక్యరాజ్యసమితికి చెందిన ఈ ఏజెన్సీ పేర్కొంది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
డబ్ల్యూఎంఓ విడుదల చేసిన తాజా గణాంకాలు, అంచనాల మేరకు ఈ జూన్ నుండి ఆగస్టు మధ్య కాలంలో ఎల్ నినో ఏర్పడేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆ తరువాత నవంబర్ నెల నాటికి ఎల్ నినో మరింత బలపడే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి రెండు నుండి ఏడేళ్లకోసారి వచ్చే ఈ సహజసిద్ధమైన వాతావరణ ప్రక్రియ, ఈసారి మానవ తప్పిదాల వల్ల పెరిగిన భూతాపంతో జతకట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్త వర్షపాత సరళిని తలకిందులు చేయనుంది.
ఈ ఎల్ నినో ప్రభావం వల్ల భూగోళంపై కొన్ని ప్రాంతాలు తీవ్రమైన కరవు కాటకాలతో అల్లాడిపోతుంటే, మరికొన్ని ప్రాంతాలు అకాల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం కానున్నాయి. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిపోయిన భూమికి, రాబోయే ఎల్ నినో తోడైతే వాతావరణ మార్పుల తీవ్రత అనూహ్యంగా ఉంటుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎల్ నినో ప్రభావంతో వచ్చే ఏడాది చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా (హాటెస్ట్ ఇయర్ ఇన్ హిస్టరీ) రికార్డు సృష్టించే ప్రమాదం ఉందని డబ్ల్యూఎంఓ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/elnino-severe-strike-worldwide-36-221592.html
సోమవారం మధ్యాహ్నం క్యూబాలో భారీ భూకంపం సంభవించింది. ఆ తరువాత గంటల వ్యవధిలోనే.. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని హర్మూజ్‌గాన్ ప్రావిన్స్‌లో మరో భూకంపం సంభవించింది. ఈ రెండు భూకంపాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. క్యూబా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏకంగా 6.1 గా నమోదైంది.
ఇలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు.
సాంకేతిక లోపంతో వల్ల ఒక భారీ ట్రక్కు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో.. అదే సమయంలో వెనుక నుంచి కార్మికులతో వస్తున్న ఒక మినీబస్సు.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. కార్మికుల బస్సును డ్రైవర్ అతి వేగంగా నడపడం, వేగాన్ని నియంత్రించలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
సిరి కేవలం ఒక కమాండ్ ఫాలో అయ్యే టూల్‌లా కాకుండా.. అత్యంత సహజంగా సంభాషించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. వినియోగదారుల ప్రైవసీని యాపిల్ ఇక్కడ కూడా కొనసాగించింది. డేటా అంతా డివైస్ లోపలే ప్రాసెస్ అయ్యేలా డిజైన్ చేసింది.
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్‌కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్‌స్పెక్టర్ బి. మహేందర్‌కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.