Publish Date:Jun 23, 2022
ప్రధాని, ముఖ్యమంత్రికి లేదా ఎవరన్నా ప్రముఖుడికి జడ్ కేటగిరీ సెక్యూరిటీ వుంటుంది. శత్రువుల నుంచో, ప్రత్యర్థుల నుంచో ఉన్న ప్రాణాపాయం నుంచి వారిని తప్పించడానికి. పిల్లలు నడక నేరుస్తున్న క్రమంలో వారు కిందపడతారేమోనని ఇంట్లో ఎవరో ఒకరు వెన్నంటే వుంటూ రక్షణ కల్పిస్తారు. పిల్లలను స్కూల్లో వేయగానే తల్లిదండ్రులు మొదట కొన్ని రోజులు పిల్లలతో పాటే వారికి రక్షణగా బడికి వెళ్లడం చూస్తూంటాం. కానీ లోకంలో ఏనుగుల మంద తమ పిల్లలకు(గున్న ఏనుగులకు) ఇచ్చే రక్షణ ఎవరూ ఎవరికీ కల్పించరేరన్నది వాటిని గమనిస్తే అవగతమౌతుంది. ఇది జడ్ మూడు ప్లస్‌ల సెక్యూరిటీ!!చిన్నారి ఏనుగు పిల్ల నడక నేర్చినా సరే దానికి ఏకంగా మూడు నాలుగు ఏనుగులు రక్షణగా వుంటాయి. పిల్ల ఏనుగు మాత్రం వాటి రక్షణకు కాస్తంత ఇబ్బంది పడుతుంటుంది. తనని ముందు నడిపించవచ్చుగా అని తొందరపాటూ ప్రదర్శిస్తుంది. పెద్ద ఏనుగులు మాత్రం దాన్ని తొండంతో, కాళ్లతో అడ్డుకుంటాయి. ప్రమాదాల్లో చిక్కుకోకుండా కాపాడుతుంటాయి.జడ్ ప్లస్‌లకు మించిన ఈ ఏనుగుల రక్షణ దృశ్యాన్ని 38 సెకండ్ల మేరకు వీడియో తీసి ట్విటర్‌లో అందిం చారు అటవీశాఖ అధికారి సుశాంత్ నందా. మనుషుల్లాగానే ఏనుగుల మధ్యా ఆ ప్రేమాను బంధాలు మెండుగా వుంటాయి. ఏనుగుల మందలో వున్న ఏనుగులన్నీ మందలోని గున్న ఏనుగును సొంత బిడ్డగానే భావిస్తాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/elephants-take-allmesuares-for-baby-elephant-39-138264.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!