ఏపీలో ముందస్తా? తెలంగాణలో రాష్ట్రపతి పాలనా?

Publish Date:Sep 13, 2023

Advertisement

తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రెండు రాష్ట్రాలలోనూ ఎన్నికల వేడి సెగలు కక్కుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇరు రాష్ట్రాలలోనూ కూడా అసెంబ్లీ ఎన్నికల విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ఈ ఏడాది చివరిలో ఎన్నికలకు సర్వం సన్నాహకంగా తయారైంది.

ఇప్పటికే అత్యధిక అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను ప్రకటించేసింది. అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల శంఖారావం మోగించేసింది. సరిగ్గా ఈ సమయంలోనే జమిలి ప్రతిపాదన కేంద్రం తెరపైకి తీసుకు వచ్చింది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు కేంద్రం నిర్ణయించడానికి కారణం ఇదేనని పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ మంత్రి కేటీఆర్ కూడా మంగళవారం (సెప్టెంబర్ 18) ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ఏది ఏమైనా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలోనే తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు జరిగేది అన్న విషయంపై స్పష్టత వస్తుంది అని అన్నారు. ఒక వేళ అక్టోబర్ 10వ తేదీ లోగా తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకుంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే వచ్చే ఏడాది జరిగే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

అంటే ఒక వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడటమంటూ జరిగితే.. నిర్ణీత గడువు పూర్తయిన తరువాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యమా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే   ఈ శుక్రవారం (సెప్టెంబర్ 15) జరగనున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన  ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ప్రత్యేక సమావేశాల్లో జమిలి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాలని కేసీఆర్ తమ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. గతంలో జమిలికి కేసీఆర్ సై అన్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలలోనే కాదు, జాతీయ రాజకీయాలలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 2018 ఎన్నికల సమయంలో  కేసీఆర్ జమిలికి సై అన్నప్పుడు బీఆర్ఎస్, బీజేపీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే  బీఆర్ఎస్ లో కేంద్రం జమిలిపై తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు ఏపీలో కూడా రాజకీయం రగులుతోంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్టుతో ఒక్క సారిగా జగన్ సర్కార్ పై ప్రజాగ్రహం భగ్గుమంది. ఆ ఆగ్రహ జ్వాలలు మరింత పెరిగి సర్కార్ ను దహించేయడానికి ముందే.. ముందస్తుకు వెళ్లి ఎలాగోలా బయటపడాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకోసమే ఆయన ఇలా లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చారో లేదో.. అలా హస్తిన పర్యటన పెట్టుకున్నారు. హస్తిన పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఈ సారి ఆయన పర్యటన అజెండా ఏపీలో ముందస్తు ఎన్నికలేనని అంటున్నారు. వైసీపీ శ్రేణులు కూడా ఇది అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుతో దేశం శ్రేణులు షాక్ లో ఉన్నాయనీ, ఆ షాక్ నుంచి టీడీపీ శ్రేణులు తేరుకుని.. ఆందోళనలు ఉధృతం చేయడానికి ముందే రాష్ట్రంలో ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తే రాజకీయంగా ఏదో మేరకు లబ్ధి చేకూరుతుందన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ రద్దు చేయాలని జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారనీ, ఎటూ కేంద్రం జమిలి వ్యూహంతో ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లోనే ఏపీలో కూడా ఎన్నికలు జరిగితే మేలని జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే హస్తిన నుంచి తిరిగి రాగానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 21 నుంచి  ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అవసరమైతే వాటిని మరో రెండు మూడు రోజులు పొడిగించైనా ఈ నాలుగున్నరేళ్లలో తాను చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా నివేదించి అసెంబ్లీ రద్దు ప్రతిపాదనను జగన్ చేస్తారని చెబుతున్నారు. అయితే జగన్ ముందస్తు నిర్ణయానికి కేంద్రం అనుమతి, అంగీకారం తప్పని సరి కనుకనే ఆ విషయంలో కేంద్రం పెద్దల అనుమతి పొందేందుకే జగన్ హస్తిన పర్యటన అంటున్నారు. ఇప్పికే  ఇప్పటికే ఐదు రాష్ట్రాలలో  ఎన్నికల ప్రక్రియకు ఈసీ సన్నాహాలు మొదలెట్టేసింది. అయితే ఏపీలో మాత్రం ఈ ప్రక్రియ అధికారికంగా మొదలు కాలేదు.  

ఎలా చూసినా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సాధారణ పరిస్థితుల్లో అయితే ఏపీ ఎన్నికలు జరిగే అవకాశం లేదనీ, అయితే కేంద్రం జమిలీ ఎన్నికలపై నిజంగానే సీరియస్ గా ఉంటే.. మాత్రం ఏపీలో ముందస్తు అసాధ్యం కాదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మొత్తం మీద జమిలి చర్చ ఇరు తెలుగు రాష్ట్రాలనూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నికలు వెనక్కు జరుగుతాయన్న ఆందోళనలో ఉంటే.. ఏపీలో  ముందస్తుకు అవకాశం లేకపోతే పుట్టి మునగడం ఖాయమన్న భయంలో అధికార వైసీపీ ఉంది. మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.