మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఏక్ నాథ్ షిండే ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వైద్యుల సలహా మేరకు ఆయనను థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో షిండే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిరంతరం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందిస్తోంది.
ఏక్‌నాథ్ షిండే ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే పలువురు రాజకీయ నాయకులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన మరికొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.
Maharashtra Deputy CM, Jupiter Hospital Thane, Eknath Shinde Health, Teluguone
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/eknath-shinde-hospitalised-36-225035.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేపడుతున్న పరామర్శ యాత్రలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, ఆ సంస్థ మాజీ ఛైర్మన్ అనిల్ డి. అంబానీతో పాటు పలువురు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరొక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం నమోదైంది.
ఉత్తరాంధ్ర ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంపై
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీపి కబురు అందించాయి.
మోదీ వికసిత్ భారత్... సీబీఎన్ విజన్ ప్రతిరూపం భోగాపురం..!
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది.
పెళ్లైన నెలలకే షాక్..ఆస్ట్రేలియా ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..!
స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు..!
భారతదేశపు మొట్టమొదటి ఆర్‌ఈఐటీ ఇండెక్స్ ఫండ్ ఆగస్టు 2026లో లాంచ్ కానుంది. ఎడెల్‌వీస్ నిఫ్టీ REITs & రియాల్టీ ఇండెక్స్ ఫండ్ NFO వివరాలు, రాబడుల విశ్లేషణ మరియు పన్ను ప్రయోజనాల గురించి క్లియర్‌గా తెలుసుకోండి.
ఆగస్టు 1న దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 24K, 22K, 18K బంగారం నేటి రేట్లు, మార్కెట్ విశ్లేషణల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.