అనిల్‌ అంబానీపై సీబీఐ కేసు..!

Publish Date:Aug 1, 2026

Advertisement

 

రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌, ఆ సంస్థ మాజీ ఛైర్మన్‌ అనిల్‌ డి. అంబానీతో పాటు పలువురు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 31, 2026న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాసఘాతుకం, అధికార దుర్వినియోగం తదితర ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఈపీఎఫ్‌వోకు 1,007.55 కోట్ల అసలు నష్టంతో పాటు 808.67 కోట్ల వడ్డీ కలిపి మొత్తం 1,816.22 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

2013-14 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ సెక్యూర్డ్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీలు) జారీ చేసింది. ఈ డిబెంచర్లలో ఈపీఎఫ్‌వో సుమారు 2,500 కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు సీబీఐకి అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రిలయన్స్‌ క్యాపిటల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌తో పాటు మరో మూడు పోర్ట్‌ఫోలియో మేనేజర్ల ద్వారా ఈ పెట్టుబడులు చేసినట్టు సమాచారం...ఈ డిబెంచర్లు 2023 నుంచి 2024 మధ్య కాలంలో మెచ్యూర్‌ కావాల్సి ఉంది. అయితే అప్పటికి చెల్లింపులు జరగకపోవడంతో వివాదం తలెత్తింది. నిధులను మళ్లించడం, మోసపూరిత లావాదేవీలకు పాల్పడటం వంటి చర్యల కారణంగానే డిబెంచర్లపై చెల్లింపులు నిలిచిపోయాయని ఈపీఎఫ్‌వో ఆరోపించినట్లు సీబీఐ వెల్లడించింది. ఈ పరిణామాల కారణంగా ఈపీఎఫ్‌వోకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఏమిటన్న దానిపై సీబీఐ దృష్టి సారించింది. నిధుల మళ్లింపులో ఎవరెవరి ప్రమేయం ఉంది, మొత్తం వ్యవహారంలో ఏ విధమైన నేరపూరిత కుట్ర జరిగింది, మళ్లించిన నిధులు చివరకు ఎక్కడికి వెళ్లాయి, వాటిని ఎలా వినియోగించారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, రిలయన్స్‌ గ్రూప్‌కు సంబంధించిన పలు ఇతర ఆర్థిక వ్యవహారాలపై కూడా సీబీఐ గతంలో కేసులు నమోదు చేసింది. 

వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ తదితర సంస్థలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌), రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌), రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌), రిలయన్స్‌ టెలికామ్‌ (ఆర్‌టీఎల్‌)లకు సంబంధించిన వ్యవహారాల్లో సీబీఐ గతంలో ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొంది. రిలయన్స్‌ ఏడీఏ గ్రూప్‌కు సంబంధించిన కేసుల్లో సీబీఐ ఇప్పటివరకు నాలుగు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసి, ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ కేసులకు సంబంధించిన దర్యాప్తు ప్రక్రియను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్నట్లు సీబీఐ పేర్కొంది. తాజా కేసులోనూ అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసి, నిధుల మళ్లింపు వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థల పాత్రను వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

CBI case against Anil Ambani, Reliance Capital Limited, CBI, EPFO, Jio, Mukesh  Ambani 

By
en-us Political News

  
నువ్వు చాలా బాగా ప‌నిచేస్తున్నావు.. శెహ‌భాష్‌..లోకేష్‌` అంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏపీ విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ భుజం త‌ట్టారు.
ఏపీ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితం కాకుండా, శాంతిభద్రతలు వ్యవస్థల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేపడుతున్న పరామర్శ యాత్రలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో పోలీస్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (SPF), ఫైర్‌ సర్వీసెస్‌, జైళ్ల శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరొక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం నమోదైంది.
ఉత్తరాంధ్ర ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంపై
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీపి కబురు అందించాయి.
మోదీ వికసిత్ భారత్... సీబీఎన్ విజన్ ప్ర‌తిరూపం భోగాపురం..!
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది.
పెళ్లైన నెలలకే షాక్..ఆస్ట్రేలియా ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..!
స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు..!
భారతదేశపు మొట్టమొదటి ఆర్‌ఈఐటీ ఇండెక్స్ ఫండ్ ఆగస్టు 2026లో లాంచ్ కానుంది. ఎడెల్‌వీస్ నిఫ్టీ REITs & రియాల్టీ ఇండెక్స్ ఫండ్ NFO వివరాలు, రాబడుల విశ్లేషణ మరియు పన్ను ప్రయోజనాల గురించి క్లియర్‌గా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.