అమరావతి నిర్మాణ పనుల పున్: ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (మే2)న రానున్న నేపథ్యంలో తెలుగుదేశం కూటమి సర్కార్ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ప్రధాని పర్యటనలో ఎటువంటి లోటుపాట్లూ లేకుండా అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ పర్యటనలో భాగంగా రోడ్ షో తో పాటు భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. దీంతో జనసమీకరణకు అన్ని చర్యలూ లీసుకుంది. ఈ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచీ దాదాపు ఐదులక్షల మంది వస్తారన్న అంచనాలతో ఏర్పట్లు చేశారు. కనీసం ఎనిమిది వేల బస్సులను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రాజధానికి సమీపంలోని ఎనిమిది జిల్లాల నుంచి వచ్చే జనాల కోసమే 6600 బస్సులను, మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చే జనాల కోసం 1400 బస్సులను కేటాయించింది. అలాగే జనాలను తరలించడానికి వినియోగించే అన్ని బస్సులలోనూ ప్రభుత్వ ఉద్యోగులను ఇన్ చార్జీలుగా నియమించింది. అంటే ఒక్కో బస్సుకూ ఒక్కో ఉద్యోగిని నియమించిందన్న మాట. ప్రధాని మోదీ సభకు, రోడ్ షోలకు ఆయా ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొని రావడంతో పాటుగా వారిని ఆయా ప్రాంతాలకు క్షేమంగా తరలించే బాధ్యతలను కూడా ఇన్ చార్జిలకే అప్పగించింది
సభకు తరలి వచ్చే ప్రజలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజనం సదుపాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం కల్పించనుంది. అలాగే వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచి నీళ్లు, పండ్లు కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించింది. అంతేకాకుండా సభ ప్రాంగణంలోను, సభా గ్యాలరీల్లోను ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఆరుగురు సిబ్బందితో కూడిన వైద్య బృందాలు వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఇక శుక్రవారం (మే 2) మధ్యాహ్నం 3:20 గంటల ప్రాంతంలో ప్రధాని అమరావతికి చేరుకుంటారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలను సభకు రావాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/eight-thousand-busses-to-modi-sabha-39-197286.html
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.