Publish Date:Oct 24, 2024
ఆర్థిక అంతరాలతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన చదువు అందించాలన్న సదాశయంతో ఎప్పుడో 2020లోకే కేంద్రం జాతీయ విద్యావిధానాన్ని రూపొందించింది. ఐదేళ్లు గడుస్తున్నా ఆ దిశగా సాగుతున్న ప్రయత్నాల వేగం నత్తతో పోటీ పడుతోంది. ఇప్పటికీ దేశంలో విద్యార్థులకు అందుతున్నది వానాకాలం చదువులే. 21వ శాతాబ్దపు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలు పెరగలేదు. విద్యా ప్రమాణాలను పెంచాలి, పరిశోధనలకు పెద్ద పీట వేయాలన్న లక్ష్యం దిశగా అడుగులు వేయడంలో ప్రభుత్వాల వైఫల్యం విద్యార్థులకు శాపంగా మారింది.
ఇందుకు ప్రధాన కారణం రాజకీయమే. బడ్జెట్ లో సింహభాగం తదుపరి ఎన్నికలకు పెట్టుబడిగా భావిస్తూ ఉచితాలకు కేటాయించడమే. అదే సమయంలో విద్యకు కేటాయింపులు తగ్గిపోవడమే. విధానాల రూపకల్పనే కానీ నాణ్యతతో కూడిన విద్యను ప్రణాళికా బద్ధంగా విద్యార్థులకు అందించాలన్న రాజకీయ సంకల్పం ప్రభుత్వాలలో కొరవడింది. ఎన్నికలు, ఓట్లు, విజయం లక్ష్యంగానే ప్రభుత్వాల ప్రణాళికలు, కేటాయింపులు ఉంటున్నాయి.
2021-22 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 14.89 లక్షల పాఠశాలల్లో 26.52 కోట్లమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే చాలా వరకూపాఠశాలల్లో కనీస సౌకర్యాల కొరత తీవ్రంగా ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చాలా వరకూ పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవు. ఆట మైదానాలు లేవు. ఇక పాఠశాల భవనాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు పాతిక శాతం పాఠశాలల పరిస్థితి ఇప్పుడో, ఇహనో కూలిపోతాయా అన్నంతగా శిథిలావస్థకు చేరుకున్నాయి. సరిపడా తరగతి గదులు లేవు. విద్యార్థుల సంఖ్యకు ఉండాల్సిన టీచర్ల సంఖ్యకూ అసలు పొంతనే లేదు. మరుగుదొడ్లు లేని పాఠశాలలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ప్రతి సౌకర్యం విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో తప్పని సరిగా ఉండాలి. అయితే దేశంలో ఆ చట్టం అమలు అవుతున్న దాఖలాలు లేవు. యువభారతం అంటూ భుజాలు తడుముకోవడమే తప్ప.. యువకులకు వారి నైపుణ్యాలకు అనుగుణంగా విద్యను అందించే విషయంలో మాత్రం మన ప్రభుత్వాలు పూర్తిగా వెనుకబడ్డాయని చెప్పక తప్పదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/education-quality-very-ow-25-187336.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్