పొయ్యి మీద పెట్టకుండానే నూనె కాగుతుంది... ఎలా?

Publish Date:Sep 14, 2024

Advertisement

పొయ్యి మీద పెట్టకుండానే నూనె సలసలా కాగుతోంది. అవునా.. నిజమా అనుకుంటున్నారా? అవును ఇది పాక్షికంగా నిజమే. ఇది ఏ మ్యాజిక్కో కాదు.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా నూనె ప్యాకింగ్‌లో వుండగానే సలసలా కాగుతోంది. ఎందుకంటే, వంట నూనెల మీద దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. దానివల్ల వంట నూనె ధరలు భారీగా పెరగబోతున్నాయి. పండగలు వస్తున్నాయి.. పిండివంటలు చేసుకుంటాం. ఇలాంటి సమయంలో నూనెల ధరలు పెంచితే ఎలా అని బాధపడుతున్నారా? మీరెంత బాధపడినా ఉపయోగం లేదు. కేంద్రం డెసిషన్ తీసుకుంది. ఇది ఫైనల్ అంతే! 

ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మీద ఇప్పటి వరకు ఎలాంటి దిగుమతి సుంకం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా 20 శాతం దిగుమతి సుంకాన్ని దేశ ప్రజలకు కానుకగా ఇచ్చింది. అలాగే రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ మీద ఇప్పటి వరకు 12.5 శాతం వున్న దిగుమతి సుంకాన్ని దేశ ప్రజల మీద ప్రేమతో 32.5 శాతానికి పెంచారు. ఈ దిగుమతి సుంకాల పెంపు మాత్రమే కాకుండా, అదనంగా అగ్రికల్చరల్ సెస్‌ని కూడా వడ్డిస్తారు. దాంతో వంటనూనెలు పొయ్యిమీద పెట్టకుండానే ప్యాకింగ్‌లోనే కాగిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతారు... పండగ చేసుకోమంటారు.. ఎలామరి? ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద మనసు చేసుకుని నూనెల ధరలు ఎందుకు పెంచిందో తెలుసా? ఇలా ధరలు పెంచడం వెనుక చాలా గొప్ప కారణం వుంది. వంట నూనెల దిగుమతుల కారణంగా దేశంలో నూనెగింజల్ని సాగుచేసే రైతులు నష్టపోతున్నారట. ఇప్పుడు దిగుమతి చేసుకునే నూనెల ధరలు పెంచడం వల్ల నూనెగింజల్ని సాగుచేసే రైతులకు మేలు జరుగుతుందట. అందుకే కేంద్రం నూనెల మీద దిగుమతి సుంకాన్ని పెంచిదట. దీనికీ, దానికీ సంబంధం ఏంటని ఆలోచించి బుర్ర హీటెక్కుతోందా? ఒకవైపు నూనె ఎలాగూ హీటెక్కింది. దాని గురించి ఆలోచించి బుర్రలు కూడా హీట్ చేసుకోవడం అవసరమా? నూనె అవసరం అనుకుంటే, తక్కువ నూనెతో వంటలు చేసుకోండి. అది కూడా మా వల్ల కాదు అంటే, నీళ్ళతో ట్రై చేయొచ్చేమో ఆలోచించండి. అంతేగానీ, ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే, పేదవాడి ఆలోచన బుర్రకు చేటు!

By
en-us Political News

  
జాతీయ రాజకీయాలలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకూ నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా మారిపోతోంది. ఈ పార్టీ పరిస్థితి ఉనికిని కాపాడుకోవడానికి తంటాలుపడే పరిస్థితికి చేరుకుందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది.
తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్య‌నేత‌ల్లో బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఒక‌రు. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన ఈట‌ల‌.. తెలంగాణ‌ బీజేపీలో కీల‌క నేత‌గానూ కొన‌సాగుతున్నారు. సౌమ్యుడు, మృదు స్వ‌భావిగా ఆయ‌న‌కు పేరుంది. అయితే, ప్ర‌స్తుతం ఈటల‌ త‌న రాజ‌కీయ పంథాను మార్చారు. గేరుమార్చి దూకుడు రాజ‌కీయాల‌కు పెద్ద‌ పీట వేస్తున్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్  రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మహా ధర్నా చేపట్టడానికి కోర్టు పచ్చ జెండా ఊపింది.
హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఇద్దరు కూడా ఆటో డ్రైవర్లుగా ఉన్నారు.  మణికొండకు చెందిన ఆటో డ్రైవర్లు రాజ్ కుమార్, ఏనుగు వెంకటేశ్వర్లు తమ గ్రామానికి చెందిన యువతితో ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు.
తెలంగాణలో రెండో రోజు గ్రామసభలు కొనసాగుతున్నాయి.  ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడానికి అర్హులైన లబ్దిదారుల కోసం రేవంత్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. గ్రామ సభలు నిర్వహిస్తోంది.
దొర‌క్క దొర‌క్క కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికితే ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అదే త‌ర‌హాలో గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నేత‌లు నానా హ‌డావుడి చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత వైసీపీ నేత‌లు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ‌ హ‌డావుడి చేస్తున్నారు.
మావోయిస్టులను భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ ఒడిశా సరిహద్దుల్లో సోమవారం నుంచి మంగళవారం వరకూ రెండు రోజుల పాటు జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పాతిక మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (జనవరి 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూకాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా ధర్శనానికి అనుమతిస్తున్నారు.
చట్టానికి అతీతులు ఎవరూ  కాదు అని  ఈ కేసు మరో మారు నిరూపణ అయ్యింది. నాగచైతన్య, శోభితల విషయమై ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై ఫిలింజర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు తెలంగాణ మహిళా కమిషన్  నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఏపీకి సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) రానుందా? ఈ సంటర్ విశాఖ పట్నంలో ఏర్పాటు కానుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఎమ్ఎన్సీ ఐటీ సంస్క సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ కట్సౌదాస్ తో మంగళవారం (జనవరి 21) భేటీ అయ్యారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేలా.. అనేకానేక విషయాలలో ఈ కుంభమేళా దానికదే సాటి. ఈ కుంభమేళాకు సాధువులు, నాగసాధువులు, అఘోరాలు ఇలా జనం ముందు ఎప్పుడో కానీ కనిపించని ఎందరెందరో వస్తారు. ఇలాంటి వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగులు తారు.
ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్​ ఎకనమిక్​ ఫోరం శిఖరాగ్ర సదస్సులో భాగంగా దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి బృందం అక్కడ తెలంగాణ పెవిలి యన్‌ను ప్రారంభించింది. ఈ పెవిలియన్ లో కేంద్ర మంత్రులు చిరాగ్ పశ్వాన్, జయంత్ చౌదరిలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
మాజీ మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ పార్టీ విజయానికి ఈ హత్య ద్వారా వెల్లువెత్తిన సానుభూతి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.