ఏపీ మద్యం రవాణా కుంభకోణం: లగ్జరీ కార్లు, రోలెక్స్ వాచీలు సీజ్ చేసిన ఈడీ!

Publish Date:Jun 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో  ఈడీ దూకుడు పెంచింది.   ఈడీ ఈ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా హైదరాబద్ లో నిర్వహించిన సోదాలలో  ఒక ఖరీదైన లగ్జరీ కారు,    94.5 లక్షల రూపాయల విలువైన  విలువైన రోలెక్స్ వాచి వంటి అత్యంత విలాసవంతమైన  వస్తువులు,  లెక్కల్లో  భారీ నగదు,  కీలకమైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది.

ఈ మొత్తం వ్యవహారంలో తెరవెనుక నడిచిన మనీలాండరింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ ఈ  చర్యలు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభుత్వ ఐటీ మాజీ  సలహాదారు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేశిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌బీసీఎల్) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలను ఈడీ ఇప్పటికే  అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  వీరితో పాటు విజయ నరసింహారెడ్డి, వల్లు సందీప్, కార్మూరు నాగేశ్వరరావు, క సునీల్ కుమార్‌లకు చెందిన నివాసాల్లోనూ ఈడీ  సోదాలు నిర్వహించింది. అరెస్టయిన రాజ్ కేశిరెడ్డి, వాసుదేవ రెడ్డిలను ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వీరికి ఈ నెల   25 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. 

ఈ కుంభకోణానికి రాజ్ కేశిరెడ్డే ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లుఈడీకి ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.  సేకరించింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా ఉన్న కాలంలో ఆయన తనకున్న   రాజకీయ, పరిపాలనా పలుకుబడిని ఉపయోగింది,  ఏపీఎస్‌బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవ రెడ్డి, ఆయన అనుచరుడు తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో చేతులు కలిపి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం రవాణా టెండర్లు  కేవలం తమ అనుకూల సంస్థలకే దక్కేలా నిబంధనలను మార్చేసినట్లు ఈడీ గుర్తించింది.  సిట్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు మొదలుపెట్టగా.. అదనపు ప్రధాన కార్యదర్శి  ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ ఉద్దేశపూర్వక నిబంధనల ఉల్లంఘన వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ. 195.33 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని తేలింది.

టెండర్ ప్రక్రియలో  సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌సీఎస్‌పీఎల్)', అలాగే  ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్ వంటి సంస్థలను ముందుంచి నడిపించారనీ..  వాస్తవానికి ఈ సంస్థల ఆర్థిక, నిర్వహణ నియంత్రణ అంతా రాజ్ కేశిరెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే సాగిందనీ ఈడీ చెబుతోంది. మద్యం డిపోల నుండి రిటైల్ షాపులకు మద్యం సరఫరా చేసే ఈ నెట్‌వర్క్‌ను వాడుకుని, మార్కెట్ రేట్ల కంటే   ఎక్కువ ధరలకు రవాణా కాంట్రాక్టులు కట్టబెట్టి, కోట్ల రూపాయల నేరపూరిత ఆదాయాన్ని సృష్టించారని ఈడీ తేల్చింది.  

By
en-us Political News

  
ఒకప్పుడు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని ఎలా మార్చిందో.. అచ్చం అలాగే.. ఆ మాటకొస్తే అంతకు మించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రలో ఆర్థిక విప్లవాన్ని తీసుకురాబోతోంది.
బజాజ్ ఫైనాన్స్ క్యూ1 ఆర్థిక ఫలితాల్లో రూ. 5,986 కోట్ల నికర లాభం సాధించడంతో షేరు ధర 6% పైగా దూసుకెళ్లింది. మోతీలాల్ ఓస్వాల్ బై రేటింగ్ ఇచ్చి రూ. 1,300 టార్గెట్ ధార్యాన్ని ప్రకటించిన వేళ సమగ్ర విశ్లేషణ.
Google DeepMind విడుదల చేసిన Gemini Robotics 2.0 సాంకేతికత, 92% విజయవంతమైన హోల్ బాడీ కంట్రోల్, అధునాతన సేఫ్టీ బెంచ్‌మార్క్స్ మరియు విప్లవాత్మక ఫీచర్లతో రోబోటిక్స్ రంగాన్ని ఎలా మార్చేస్తుందో పూర్తిగా తెలుసుకోండి.
టవర్లు లేకున్నా మీ మొబైల్‌కు డైరెక్ట్ సిగ్నల్స్ అందించేందుకు అమేజాన్ 5,105 ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది. అమేజాన్ లియో D2D ప్రాజెక్ట్, గ్లోబల్‌స్టార్ డీల్ మరియు లాంచ్ టైమ్‌లైన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
గత కొన్ని రోజులుగా ఆయన నాడీ వ్యవస్థను, మెదడు పనితీరును సాధారణ స్థితికి తెచ్చేందుకు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది.
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్! ఇకపై బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడానికి రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏఐ సహాయంతో 1,072 బగ్స్‌ను సరిచేసి డైనమిక్ ప్యాచింగ్ సాంకేతికతను తీసుకొస్తున్న గూగుల్ విప్లవాత్మక అప్‌డేట్ వివరాలు ఇవే!
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 8న ప్రారంభం కానుంది. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25, 4K టీవీలపై భారీ ఆఫర్లు, ఎస్బీఐ కార్డ్‌పై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు ప్లస్ మెంబర్లకు ఆగస్టు 7 నుంచే ఎర్లీ యాక్సెస్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల FPI కొనుగోళ్ల జోరు పెరిగింది. ఒకే రోజులో ₹8,831.1 కోట్ల రికార్డు పెట్టుబడులతో పాటు నిఫ్టీ, సెన్సెక్స్ విశ్లేషణ, ఐపీఓ పెట్టుబడులు మరియు మార్కెట్ ట్రెండ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
MV ఎలక్ట్రోసిస్టమ్స్ IPO రోజువారీ GMP, సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, షేరు ధర మరియు రైల్వే ప్రొపల్షన్ ఆర్డర్ బుక్ వివరాలను తెలుసుకోండి. మధురి కేలా మద్దతు ఉన్న ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టవచ్చా లేదా బ్రోకరేజ్ విశ్లేషణ ఇక్కడ చూడండి.
కామన్వెల్త్ గేమ్స్ 2026 డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించిన తల్లి, పీహెచ్‌డీ స్కాలర్ సీమా కాళిరామ్నా స్ఫూర్తిదాయక కథ. 11 నెలల బాబును వదిలి సాధించిన ఈ చారిత్రాత్మక విజయం విశేషాలు చూడండి!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ శుభారంభం! వెయిట్‌లిఫ్టింగ్ రికార్డుతో లవ్‌ప్రీత్ సింగ్ రజతం సాధించగా, డిస్కస్ త్రోలో సీమా కాలిరామ్నా కాంస్యం గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా ఫైనల్ విశేషాలు ఇవే!
ఘటన జరిగిన సమయంలో భవనంలో పాతిక నుంచి ముఫ్ఫై మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.