దోస్తుల్లో దడదడ

Publish Date:Jul 28, 2022

Advertisement

చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఈ రెండు పేర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్,తెలంగాణా లో  పలువురు నాయకులూ,సెలబ్రటిలు గుండెల్లో రైళ్ళు పెరుగేతిస్తున్నాయి.ఇంతకాలం రహస్యం గా సాగిన వారి చీకటి వ్యాపారం ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) దెబ్బతో బట్టబయలైపోయింది. కేసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి నివాసాలతోపాటు.. మరో ఆరు ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు.

ఆ క్రమంలో ప్రవీణ్.. ల్యాప్‌టాప్‌, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం విచారణకు హాజరుకావాలంటూ ప్రవీణ్‌ను ఈడీ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కేసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్‌‌పై ఈడీ దాడులు తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  గుడివాడలో ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా నిర్వహించిన కేసినోపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి విదితమే. గుడివాడలో కేసినో నిర్వహణ వెనుక నాటి రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని హస్తం ఉందంటూ నాడు విమర్శలు వెల్లువెత్తిన సంగతి విదితమే.    టీడీపీ నేతలు అయితే వరుస ప్రెస్ మీట్లతో కేసీనో వ్యవహారంపై   విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలో కేసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్‌తో కృష్ణాజిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు లింకులు ఉన్నాయంటూ అందుకు సంబంధించిన సాక్ష్యాలను మీడియా ముందుంచారు. కానీ టీడీపీ నేతల ఆరోపణలను జగన్ ప్రభుత్వం లైట్‌గా  తీసుకుంది.  దీంతో టీడీపీ నేతలకు  గుడివాడలో   కేసినో వ్యవహారంపై ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారమంతా కామ్ అయిపోయింది.   

కానీ తాజాగా ఈడీ సోదాలతో కేసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డిల పేర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మళ్లీ కేసినో తుట్టె మళ్లీ కదిలింది.  మరోవైపు చికోటి ప్రవీణ్.. నిర్వహిస్తున్న ఈ భాగోతం వెనుక బడా బడా నేతలే ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనిపై సోమవారం ఈడీ విచారణలో ప్రవీణ్ పెదవి విప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక చికోటి ప్రవీణ్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఇండో నేపాల్ సరిహద్దుల్లో నిర్వహించిన కేసినోకి వెళ్లిన కస్టమర్ల జాబితాలో  16 మంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయని చెబుతున్నారు.  

ఇక తెలంగాణలో కేసీఆర్ కేబినెట్‌లో కీలక మంత్రికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ను.. చికోటి ప్రవీణ్ స్నేహితుడు  మాధవరెడ్డి కారుకు తగలించుకొని.. తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలిగా తిరిగేస్తున్నాడట. ఈ విషయంపై సదరు మంత్రి ని మీడియా ప్రశ్నించగా... ఆ కారు స్టిక్కర్ తనదేనంటూ అంగీకరించారు. అయితే ఈ ఏడాది మార్చిలోనే ఆ స్టిక్కర్‌ను తొలగించానని.. దానిని ఎవరు తీసుకుని వాడుతున్నారో.. తనకు తెలియదని ముక్తాయించారు.

మరోవైపు ప్రవీణ్‌, మాధవ్ రెడ్డిపై ఈడీ కన్ను పడడంతో.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీల్లో దడ మొదలైనట్లు సమాచారం. గుడివాడలో కేసినో నిర్వహణకు ముందు గన్నవరం ఎమ్మెల్యే వంశీ తన స్నేహితుడు, మంత్రి అంటూ కొడాలి నానిని చికోటి ప్రవీణ్‌కు పరిచయం చేశారనే ఓ టాక్ కూడా అప్పట్లో  కృష్ణా జిల్లాలో బలంగా వినిపించిందట. అంతేకాదు.. గుడివాడలో కేసినో నిర్వహణకు ముందే గన్నవరంలో కూడా కేసినో నిర్వహించారని.. కానీ నాడు ఇది అంతా ఫేమస్ కాకుండా.. గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయిందని సమాచారం. అది  కూడా చికోటి ప్రవీణ్ డైరెక్షన్‌లో జరిగిందని తెలుస్తోంది. ఏదీ ఏమైనా..  చికోటి ప్రవీణ్‌ని విచారించిన ఈడీ అధికారులు త్వరలో ఈ దోస్తులను కూడా విచారించే అవకాశం ఉందనే టాక్ అయితే ఉమ్మడి కృష్ణాజిల్లాలో జోరుగా సాగుతోంది.

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.