ఐ ప్యాక్ కార్యాలయాలు, ఎగ్జిక్యూటివ్ ల నివాసాలలో ఈడీ సోదాలు
Publish Date:Apr 3, 2026
Advertisement
బుధవారం (ఏప్రిల్ 2) ఉదయం దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు కలకలం సృష్టించాయి. మనీ లాండరింగ్ కేసులో ఈడి ఈ సోదాలు నిర్వహించింది. ముఖ్యంగా రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ ప్యాక్ కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నివాసాల్లో ఈ తనిఖీలు జరిగాయి.దేశ వ్యాప్తంగా మొత్తం పది ప్రాంతాలలో జరిగిన ఈ తనఖీలలో కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్ ముంబై నగరాలలోని ఐ ప్యాక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల నివాసాలతో పాటు వారి బంధువుల నివాసాలపై కూడా ఈడీ దాడులు చేసిందనీ చెబుతున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ కార్యాలయాలపై దాడులు నిర్వహించిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. బెంగళూరులో కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే ఐప్యాక్ కు చెందిన ప్రతీక్ శర్మ, వినీష్ చందాకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో కూడా సోదాలు జరిగాయి. ఈడీ ఈ ఏడాది జనవరిలో పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కు సంబంధించిన కేసులో కోల్ కతాలోని ఐప్యాక్ కార్యాలయాలలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
http://www.teluguone.com/news/content/ed-raida-in-ipack-36-216601.html





