నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి లకు ఈడీ నోటీసులు
Publish Date:Sep 23, 2022
Advertisement
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ మళ్లీ దూకుడు పెంచింది. ఇటీవలే ఇదే కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ తాజాగా ఏపీకి చెందిన ఇద్దరు నేతలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఇరువురూ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులైన అలీ షబ్బీర్, పి. సుదర్శన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎంఎల్ పిఏ ( ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం) సెక్షన్ 50 కింద వీరిరువురికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సంబంధం ఉన్న కంపెనీలకు ఈ ఇరువురి నాయకుల ఖాతాల నుంచి నిధులు బదలీ అయ్యాయని ఈడీ వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఇరువురిలో సుదర్శన్ రెడ్డిని వచ్చే నెల 10న విచారణకు కావలసిందిగా ఈడీ ఆ నోటీసులలో పేర్కొంది. మరో నాయకుడు అలీ షబ్బీర్ మరుసటి రోజు అంటు అక్టోబర్ 11న ఈడీ ఎదుట హాజరౌతారు. ఈడీ వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలికి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ కు చెందిన ఆ నాయకురాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసినట్లు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/ed-notices-to-ali-shabbi-and-psudershanreddy-25-144294.html





