బీజేపీ రాజకీయ వేధింపుల్లో భాగమే.. సచిన్ పైలట్
Publish Date:Jun 22, 2022
Advertisement
నేషనల్ హెరాల్డ్‌కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) సుదీర్ఘ సమయం ప్రశ్నించడం కేంద్ర ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడగానే కనపడుతోందని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ఆరోపించారు. బుధవారం ఏకంగా 12 గంటలపాటు ప్రశ్నించడం వెనుక మోడీ సర్కార్ కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకోవడమే కనపడుతోందని అన్నా రు. ఇది కేవలం మోదీ సర్కార్‌ను నిలదీస్తున్నందుకు కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ పార్టీనే కాదు మొత్తం ప్రతిపక్షాలనూ కేంద్రం టార్గెట్ చేసినట్టు స్పష్టమవు తోందని ఆరోపించారు. ఇన్‌కమ్ టాక్స్, సిబిఐ, ఈడీ వంటి సంస్థలతో వరుస దాడులు చేపట్టడం బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షాల పట్ల వ్యవహరిస్తున్న తీరును బహిర్గతం చేస్తుందనేది దేశంలో ప్రతీ పౌరుడికీ తెలిసిపోయిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలన్న ఆతృత బిజెపి కనిపిస్తున్నదనీ, ఇటువంటి చర్యల ద్వారా ఆ పార్టీ తన ఉద్దేశాన్ని స్వయంగా బహిర్గతం చేసుకుంటోందని పైలట్ అన్నారు. రాహుల్ గాంధీని జూన్ 13 నుంచి 15వ తేదీ వరకూ ఇ.డి 40 గంటలకు పైగా ప్రశ్నించడం దారుణమని పైలట్ అన్నారు. రాహుల్ తన తల్లి సోనియాగాంధీ అనారోగ్యం కారణంగా వ్యక్తిగతంగా పిలిచి ప్రశ్నించడానికి కొంత సమయాన్ని ఇవ్వాలని ఆయన తరఫున కాంగ్రెస్ నేతలు ఈడీ ని కోరారు. కానీ అందుకు ఇ.డి నుంచి ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. కానీ ఆయన్ను జూన్ 20 రావచ్చునని ఈడీ . తెలియజేసింది. మంగళవారం అర్ధరాత్రి వరకూ ఆయన్ను ప్రశ్నించడం కొనసాగింది. అంతేగాక జూన్ 15న ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకుని వచ్చి నాయకులపై దాడి చేయడం అమానుషమని పైలట్ వర్ణించారు. పోలీసులు వృత్తి ధర్మం కాకుండా గూండాగిరీ ప్రద ర్శించడం దారుణమని దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
http://www.teluguone.com/news/content/ed-inquiry-of-rajiv-iscenter-political-harrasment-39-138209.html





