Publish Date:Nov 30, 2022
తెలుగుదేశం నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయనతో పాటు ఆయన కుమారుడి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. వాహనాల కుంభకోణం కేసులో ఈడీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. జేపీ ప్రభాకరరెడ్డి, ఆయన కుమారుడివి కలిపి మొత్తం 22.10 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. బీఎస్ 3 వాహనాలకు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి బీఎస్ 4గా మార్చినట్టు ఈ దర్యాప్తులో ఈడీ గుర్తించింది. ఇందుకు సంబంధించి నాగలాండ్, కర్నాటక, ఏపీలో రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించింది. ఆర్టీవో అధికారులతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. అలాగే అశోక్ లేలాండ్ నుంచి స్క్రాప్ లో వాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించింది. ఇలా ఉండగా రాజకీయ కక్షతోనే ఈడీ వేధిస్తోందని జేసీ ప్రభాకరరెడ్డి అంటున్నారు.
ఇంతకీ కేసేమిటంటే. బీఎస్ 3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించింది. కానీ ఆ వాహనాలనుబీఎస్ -4 వాహనాలుగా చూపించి జేసీ ప్రభాకరరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేసింది. స్క్రాప్ కింద అశోక్ లేలాండ్ లో కొన్న 154 బస్సులను ఫోర్జరీ డాక్యూమెంట్లతో నాగాలాండ్ లో రిజిస్రేషన్ చేయించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) పొందినట్లు ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ ఆరోపించింది. దీనితో జేసీ ట్రావెల్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించే ఇప్పుడు ఈడీ జేపీ ప్రభాకరరెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ed-attaches-jc-prabhakar-reddy-assets-25-147910.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.