ఎన్నికల కమిషన్ హెచ్చరిక...గోడమీద పోస్టర్

Publish Date:Oct 25, 2022

Advertisement

ప్రతీ గల్లీలో జనం పరిగెడుతున్నారు. గ్రామకూడలిలో వేపచెట్టుకింద ఒక వ్యక్తి  ఆభరణాలు పంచు తున్నాడు. పిల్లలయితే ఉంగరాలు, పెద్దవాళ్లయితే గాజులు,గొలుసులు, వడ్డాణాలూను. మన రాజుకింత బుద్ధుంటే బావుండేది అనుకుంటూ అవి తీసుకున్న ఆనందంలో రాజుని వీలయినంతగా తిట్టుకుం టున్నారు. అలానే ఇళ్లకి చేరుకున్నారు. యువరాజుగారికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఎవరక్కడ అని అరిచాడు. భటుడు వచ్చాడు. ఏం జరుగుతోంది అంటూ అరిచాడు. ప్రభూ పక్కూరి వాల్లు, చిన్న రాజ్యంవారూ వచ్చి మన ప్రజలకు కానుకలు ఇస్తున్నారు. మా ఆడోళ్లూ తెచ్చు కున్నారు అన్నాడు. రాజుకి కోపం నషాలానికి అంటింది. ప్రజలా మేకలా అలా వెంటబడి మీదబడి తీసు కుంటారా? అని కోపగించుకున్నారు. బాగా ఆాలోచించి మంత్రికి వాళ్లని తరిమే యమన్నాడు. మంత్రి వెళ్లి ఒక వడ్డాణం తీసుకుని ఇప్పుడు కాదు మరో రోజు రండి అని పంపేశాడు. ఈసమాచారం విని రాజుగారు ఒక ప్రకటన చేయించారు.. ఎవరూ ఎవరి కానుకలను తీసుకోరాదని. ఎవరు కానుకలు ఇవ్వడానికి వచ్చినా వెంటనే కబురుపెట్టమని లేకుంటే చెట్టుకి కట్టేయ మని ఆదేశించారు. అది చదివి జనం ఊరుకున్నారు. జరిగేది జరగక మానదు, రాజుగారి హెచ్చరి కతో అన్నీ ఆాగిపోతే రాజ్యం ఎందుకైతది?  ప్రస్తుతం మునుగోడు ప్రచారంలో ఉన్న పార్టీలన్నీ ఓటరుని ఆకట్టుకోవడానికి అనేక బహుమానాలు ఇవ్వడం మీదనే ఆసక్తి చూపుతున్నాయి. అసలు ఇప్పటికే కోట్లు ప్రవాహంగా వెళిపోయాయి. కొంతే పట్టుబడిందని మీడియా కోడయి కూస్తోంది. ఇప్పటికి భారత ఎన్నికల కమిషన్ వారికి ఇక్కడి సమాచారం తెలిసింది. వెంటనే అలా కానుకలు రూపంలో ఏమీ ఎవ్వరూ ఇవ్వడానికి వీల్లేదని శాసించింది. ప్రజలకు ముఖ్యంగా ఓటరుకి పొట్టచెక్కలయ్యేంత నవ్వొచ్చింది. 

పార్టీలు గెలవడానికి అన్ని యత్నాలూ చేస్తున్నాయి. వాటిలో భాగమే ఈ కానుకుల సంగతి. కొందరు ఏకంగా బంగారం ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారట. అంటే మునుగోడు ఓటరు అనతికాలంలోనే కోటీశ్వరుడు అయినా పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు. ఎవరు ఏమీ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకో వాలని హెచ్చరికలు జారీచేయడం పెద్ద అమాయకత్వం. అధికారంలోకి రావాలి, మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలి, రెండింటిలో ఏదయినాసరే పార్టీలకు ప్రధానమే. అందువల్ల తమ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి చేయాల్సిన అన్ని పనులూ చేస్తారు, అన్ని మార్గాలను అనుసరిస్తుంటారు. ఇది అనాదిగా ఉన్నదే. కాబోతే, ఇ.సి మాత్రం ఈసారి గట్టి చర్యలు తీసుకోవడానికి నిర్నయించింది. ఎవర యినా సరే డబ్బురూపంలోగాని, వస్తు రూపంలోగాని పార్టీల నుంచి, అభ్యర్ధుల నుంచి తీసుకోరాదు, అది ఘోరనేరంతో సమానమని భారీ ప్రచారానికి పూనుకుంది. పూర్వం సినిమాలకు రిక్షాల ప్రచారంలాగ వాహనాల్లో మైకు ప్రచారానికి, గోడల మీద పోస్టర్ల ప్రచారానికి పూనుకుంది. ప్రాంతీయ భాషలో ఈ ప్రచారం జరగాలని  తెలంగాణా అధికారులను ఆదేశించింది. ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్, ఏవిఎంలు సిద్ధమయ్యాయని సీఈఓ వికాస్ రాజ్ తెలియజేశారు. 

మునుగోడు నియోజకవర్గంలో 80 ఏళ్లు నిండిన 345 మంది ఓటర్లు, 394 మంది దివ్యాంగుల ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి నిర్ణీత గడువులోగా ఫారం 12 డి సమర్పించారు. సీనియర్ సిటి జన్లు, పీడబ్ల్యూడీ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లు వేయడానికి ఈసీఐ సూచనల మేరకు షెడ్యూల్‌ను సిద్ధం చేసి నట్లు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 కేసులు బుక్ చేశామని, 2.5 కోట్లు సీజ్ చేశామని వికాస్ రాజ్ తెలిపారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది 1,483 లీట ర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని, 77కేసులు నమోదుచేసి 36 మందిని అరెస్టు చేశామని చెప్పారు.

మునుగోడుకు వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సుబోధ్ సింగ్‌తో పాటు ఐఆర్ఎస్ అధికారి సమత ముళ్లపూడిని రెండవ ఎన్నికల పరిశీలకుడిగా  ఎన్నికల కమిషన్  నియమించింది. ఆదాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్స్) నియోజకవర్గంలోని అక్రమ నగదు ప్రవాహాన్ని నియం త్రించేందుకు వ్యయ పరిశీలకులకు సహాయం చేసేందుకు డిపార్ట్‌మెంట్ నుండి ఏడుగురు సిబ్బందిని మునుగోడుకు నియమించారు.

అన్నీ బాగానే ఉన్నాయి కానీ బహుమతులు, చేబదులు రూపంలో పార్టీవర్గాలు ఓటర్లకు ఇచ్చేవాటిని, బహిరంగంగానో, రహస్యంగానో ఇళ్లకు పంపే వస్తువులను ఏ కెమెరా కన్ను అమాంతం పట్టేస్తుంది?  రాజుగారికి కోపం వచ్చినా, ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎన్ని హెచ్చరికలు చేసినా పార్టీలు, నాయకులు, అభ్యర్ధులు, ఇపుడు  ఓటరు కూడా చాలా లైట్ గానే తీసుకుంటున్నారు. దీన్ని అవినీతి అనే కంటే మా వారికి ఇష్టపూర్వకంగా ఇస్తున్న కానుకలు అంటూ పెళ్లిలో ఇచ్చినట్టు ఇస్తున్న పుడు ఓటరు మాత్రం కాదనలేకపోతాడుకదా. లోలోపల కాస్తంత భయం ఉండచ్చుగాక, ఈ తరుణం మించితే  ఆనక ఫ్రిజ్ కొనడానికయినా నానా తంటాలు పడాలన్నది  ఓటరు ఆలోచన, పోనీలేద్దూ మనకి ఓటు వస్తాడుగా అనే నమ్మకం పార్టీలదీను.  ఇక ఇసీ ప్రకటనలు, హెచ్చరికలు గోడ మీద పోస్టర్లే. 

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.