జార్ఖండ్ సీఎంకు ఈసీ నోటీసులు.. కేసీఆర్ తో చెలిమే కొంప ముంచిందా?

Publish Date:May 4, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జార్ఖండ్ సీఎం సత్సంబంధాలే ఆయనకు ఈసీ నోటీసులు జారీ చేయడానికి కారణమైందని విశ్లేషణలు చేస్తున్నారు. అందుకేప్రజా ప్రాతినిథ్య చట్టం  ఉల్లంఘన అంటూ ఆరోపణలు, ఫిర్యాదుల పర్వానికి తెరతీసి సరెండర్ చేసేసిన మైలింగ్ లీజు సాకు చూపుతూ ఈసీ నోటీసులు జారీ చేసిందని చెబుతున్నారు.   

జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేయడానికి కేంద్రం ఒత్తిడే కారణమంటున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ ఎన్నికల సంఘం సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈసీ నోటీసులు జారీ చేసిన సమయంలో ఆయన తన తల్లి చికిత్స నిమిత్తం హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. హేమంత్ సొరేన్  తల్లి శస్త్ర చికిత్సకు నగరంలోని ప్రముఖ వైద్యుడు జీ. నాగేశ్వరరెడ్డితో మాట్లాడి అన్ని ఏర్పాట్లూ చేసింది తెలంగాణ సీఎం కేసీఆర్. వీరిరువురి మధ్యా స్నేహం, రాజకీయంగా సారూప్య సిద్ధాంతాలు ఉన్న సంగతి విదితమే. బీజేపీకి అదే కన్నెర్ర అయ్యిందంటున్నారు. సీఎం అందుబాటులో లేకపోవడంతో  ఈ సీ ఆ నోటీసును జార్ఖండ్ సీఎంవోకు అందజేసింది.

 తనకు అనకూలంగా మైనింగ్ లీజు మంజూరు చేసుకున్నారనీ, ప్రజా ప్రాతినిథ్య చట్టం 9ఏ ప్రకారం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిచారనీ ఆ నోటీసులో పేర్కొంది. అంతకు ముందే  బీజపీ జార్ఖండ్ శాసనసబాపక్ష నాయకుడు బాబూలాల్ మురాండి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిథి బృందం రాష్ట్ర గవర్నర్ ను కలిసి  హేమంత్ సొరేన్పై ‘ఆఫీస్ ఆఫ్ ఫ్రాఫిట్’ ఆరోపణలు చేసింది. ఇప్పుడు అదే ఆరోపణలపై ఈసీ హేమంత్ సోరేన్ కు నోటీసుల ఇచ్చింది. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి తనకు అనుకూలంగా మైనింగ్ లీజు  మంజూరు చేసుకున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని ఆ నోటీసులో పేర్కొంది. 2019 ఎన్నికలలో బీజేపీ జార్ఖండ్ లో పరాజయం పాలైంది. రాష్ట్రంలో గిరిజనుల విశ్వాసం పొందడంలో బీజేపీ విఫలం కావడంతో అధికారానికి దూరమైంది. వారి మద్దతు పొందిన జార్ఖండ్ సీఎంను ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ చెలిమి సాకుతో బ్బందుల్లోకి నెట్టేలా ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని ఆశ్రయించి గవర్నర్ కు ఫిర్యాదు చేసి ఈసీ నోటీసు జారీ చేసేలా ప్రయత్నించి సఫలీకృతం అయ్యింది.

జార్ఖండ్ లో ఓటమే కాకుండా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన కేసీఆర్ కు సన్నిహతమౌతుండటం కూడా బీజేపీ కన్నెర్రకు ఓ కారణమైంది. జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకిస్తూ.. కేంద్రంపై  విమర్శల జోరు పెంచిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు హేమంత్ సొరేన్ మద్దతు పలుకుతుండటంతో రాష్ట్రంలో ఆయనకు ఇబ్బందులు సృష్టించే దిశగా వేసిన అడుగే ఈసీ నోటీసు అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రాతినిథ్య చట్టం ఉల్లంఘించిన హేమంత్ సొరేన్ రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తున్నది.  గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అధికార పార్టీలోని ప్రముఖ నాయకులపై ఈడీ, సీబీఐ దాడులు జరిగిన సంగతి విదితమే. విపక్షాలను ఇబ్బందుల పాలు చేసి, వాటి ప్రతిష్టను పలుచన చేసి ఎన్నికలలో లబ్ధి పొందడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ పని చేస్తున్నదని అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అదే దారిలో ఇప్పుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ను చిక్కుల్లో పడేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహంలో భాగమే ఈసీ నోటీసులు అని పరిశీలకులు అంటున్నారు.

ఎందుకంటే మైనింగ్ లీజు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు చేసిందని జార్ఖండ్ అడ్వొకేట్ జనరల్ అంగీకరించడమే కాకుండా ఆ లీజ్ ను సరండర్ చేశారని కూడా జార్ఖండ్ హై కోర్టుకు గత ఏప్రిల్ 18నే నివేదించారు. అంతా అయిపోయిన తరువాత తీరిగ్గా ఎన్నికల సంఘం ఇప్పుడు జార్ఖండ్ సీఎంకు నోటీసు జారీ చేయడం వెనుక కేంద్రం వేధింపుల వ్యూహమే ఉందని వారు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.