వైఎస్సార్‌టీపీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. షర్మిల వెంటే విజయమ్మ..

Publish Date:Feb 24, 2022

Advertisement

కారణాలు ఏమైనా, జగనన్న కాదన్నా, పెద్దన్న సజ్జల వద్దన్నా లెక్కచేయకుండా, తెలంగాణలో సొంత జెండాను ఎగరేసిన, వైఎస్ షర్మిల...అవరోధాలను అధిగమించి, అనుకున్నది సాధించారు. కనీసం,పార్టీ పేరు వరకు అయినా, వైఎస్సార్ రాజకీయ వారసత్వం తనదే అని షర్మిల నిరుపించుకున్నారు. నిజానికి షర్మిలా ఇంచుమించుగా పదినెలలకు పైగానే తెలంగాణలో రాజకీయం చేస్తున్నారు. గత సంవత్సరం జూలైలో 8న.. పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) పార్టీగా ప్రకటించారు. గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి  దరఖాస్తు చేశారు.

అయితే, గతంలో వైఎస్ఆర్ పేరిట పార్టీని రిజిస్టర్ చేసుకున్న కొందరు, ఈసీ వద్ద అభ్యతరం వ్యక్తం చేయడంతో, వైఎస్సార్ టీపీ పేరు విషయంలో సస్పెన్స్ ఏర్పడింది. కడప జిల్లాకు చెందిన ఇదే వ్యక్తులు, గతంలో జగన్ పార్టీ వైఎస్సార్ సీపీ విషయంలోనూ  అభ్యంతారాలు వ్యక్తం చేయడంతో వైఎస్సార్ సీపీ నేతలు తమ పార్టీని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా రిజిస్టర్ చేసుకున్నారు. 
అలాగే, షర్మిల పార్టీ విషయంలోనూ ఈసీ పార్టీ పేరును మార్చుకోవాలని, ప్రత్యాన్మాయ పేరు  సూచించాలంటూ ఈసీ షర్మిలకు సూచించారు. అయితే చివరికి, ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలను షర్మిల పార్టీ ప్రతినిధులను పరిష్కరించడంతో, వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. 

ఈ మేరకు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో), రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ లేఖ రాసింది. పార్టీకి గుర్తింపు రావడం పట్ల పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో కలిసి లోటస్‌పాండ్‌లో కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీకి గుర్తింపు రాకుండా కొంతమంది అడ్డుపడ్డారని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా పార్టీ గుర్తింపును పూర్తి చేయగలిగామని ఆయన అన్నారు. పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా జిల్లాలు, మండ లాలాలకు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని షర్మిల అన్నారు. అలాగే,ఎమ్మెల్సీ ఎన్నికలు, కొవిడ్ అంక్షల కారణంగా నిలిచిపోయిన పాదయాత్రను షర్మిల మళ్ళీ మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నారు. మార్చ్ 5 నుంచి పాదయాత్ర మల్లె మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. 
అదలా ఉంటే, ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అంటూ, సుదీర్ఘ పాదయాత్ర చేసి, జగన్ రెడ్డి జైల్లో ఉన్న 16 నెలలు పార్టీని బతికించిన షర్మిల, ఇప్పుడు ఆయన వద్దన్నా సొంత  పార్టీని స్థాపించడమే కాకుండా, అవరోధాలను అధిగమించి, పార్టీ పేరును నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా, వైసీపీ సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న,తల్లి విజయమ్మ కూడా  షర్మిల పక్షం వహించారు. అదే విధంగా బాబాయి వివేక హత్య విచారణ విషయంలోనూ షర్మిల వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు, వైఎస్ కుటుంబంలో, జగన్ ఒంటరి అయినట్లే అంటున్నారు. అలాగే, విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి  రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని, తెలుస్తోంది. అదే జరిగితే ఇటు కుటుంబంలో , అటు రాజకీయంగానూ జగన్ రెడ్డి కి చిక్కులు తప్పవని అంటున్నారు ..
 

By
en-us Political News

  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.