ఏపీలో ముందస్తు తథ్యం.. వైసీపీ ఎంపి జోస్యం!

Publish Date:Apr 4, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో గడువు మేరకే ఎన్నికలు జరుగుతాయి అంటూ ముఖ్యమంత్రి జగన్ విస్పష్టంగా చెప్పిన మరుసటి రోజే అధికార పార్టీ రెబల్ ఎంపీ ఏపీలో ముందస్తు తథ్యం అని జోస్యం చెప్పారు. ఏపీ సీఎం చెప్పినదేదీ చేయరనీ,  చేసేదేదీ చెప్పరనీ ఆయన ఈ నాలుగేళ్ల పాలనలో పదే పదే రుజువౌతూ వస్తున్న నేపథ్యంలో రఘురామ జోస్యం నిజమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  తన ముఖం చూసే జనం ఓట్లేస్తారనీ, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలు మాత్రమేనని చాటుతూ వచ్చిన జగన్ కు హఠాత్తుగా ఇప్పుడు ఎమ్మెల్యేల వైఫల్యం వల్లే తన ప్రభుత్వ గ్రాఫ్ పడిపోయిందని ఆక్రోశం వ్యక్తం చేయడానికి ప్రజల్లో వైసీపీ పట్ల పెల్లుబుకుతున్న ఆగ్రహమే కారణమని పరిశీలకులు అంటున్నారు.

రఘురామకృష్ణం రాజు సోమవారం హస్తినలోని తన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముందస్తు ఎన్నికలు ఈ ఏడాది  జరుగుతాయనీ, అందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు తీరిగ్గా నాలుగేళ్లు గడిచిన తరువాత  ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు  ఉత్సవ విగ్రహాలకూ తేడా లేకుండా పోయిందన్నారు. బటన్ నొక్కాను, అభివృద్ధి పనులన్నీ తానే చేస్తున్నానని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన జగన్ ఇప్పుడు ఒక్క సారిగా మాటతప్పి, మడమ తిప్పి తాను బాగా చేస్తున్నా ఎమ్మెల్యేలు పని చేయడం లేదని నిందలు మోపుతున్నారని విమర్శిచారు.  తన ముఖమే చూసి ఓట్లు జనం ఓట్లేస్తారంటూ వచ్చిన జగన్ రెడ్డి.. ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ ఎత్తి చూపడం.. తన పాలన పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను గుర్తించడమే కారణమని చెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవానికి ముందు వరకూ వైనాట్ 175 అంటూ వచ్చిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలు గ్రాఫ్ పెంచుకోకుంటే మరోసారి అధికారం కష్టమన్నట్లుగా మాట్లాడుతుండటమే రాష్ట్రంలో వైసీపీకి, జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందనడానికి నిదర్శనమని వివరించారు.  పార్టీ ఎమ్మెల్యేలంతా గడపగడపకూ తిరిగి తీరాల్సిందేనంటున్న జగన్ తాను మాత్రం ప్రజలకు ముఖం చాటేసి పరదాల మాటున ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు.   డాక్టర్ సుధాకర్ పై దాడి ద్వారా మొదలైనవైసీపీ ఉన్మాదం  తన పైనుంచి, అచ్చన్న మీదుగా ఇప్పుడు కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీ నాయకుల వరకూ వెళ్లిందని రఘురామ అన్నారు.   సత్య కుమార్ పై జరిగిన దాడి గురించి కేంద్ర ప్రభుత్వంలోని ఒక పెద్ద వ్యక్తితో తాను మాట్లాడినప్పుడు పిచ్చి పరాకాష్టకు చేరినప్పుడు ఇలాంటి పనులు చేస్తారని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని  అన్నారని రఘురామ అన్నారు.  

రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో 24 గంటల వ్యవధిలో 1100  ఎకరాల భూమిని జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి సి ఆర్ డి ఏ కమిషనర్ శ్రీలక్ష్మి కేటాయించడం ప్రభుత్వ  కడుపు మంట తప్ప మరొటి కాదన్నారు. సుప్రీం కోర్టులో రాజధాని కేసు వాదించడానికి వందల కోట్లు వెచ్చించి న్యాయవాదులను నియమించుకొని, కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని కూడా తమ పంతాన్ని నెగ్గించుకోలేకపోయామనే అక్కసుతోనే రైతులను వేధించాలనే ఉద్దేశ్యంతోనే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటన విజయవంతం అయి, పొత్తులపై ఒక స్పష్టత రావాలని రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.