తెలంగాణలో ముందస్తు ఖాయం.. మార్చి తరువాత ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దు

Publish Date:Nov 18, 2022

Advertisement

‘ముందస్తు ముచ్చటే లేదు.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు’ ఇటీవల తెరాస విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు. అంటే రాష్ట్రంలో ముందస్తు ప్రశక్తే లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. పూర్తి కాలం మనం అధికారంలోకి ఉంటాం అని పార్టీ శ్రేషులకు విస్పష్టంగా చెప్పేశారు కేసీఆర్. ఆయన అంత స్పష్టంగా చెప్పినా ఆ మాటలను పార్టీ శ్రేణులు నమ్మడం లేదు.

ఆ మాటల వెనుక ఉన్న అర్ధం వేరని రాజకీయ వర్గాలు సైతం భాష్యం చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్  ఒక మాట మాట్లాడారంటే, ఆ మాటకు అర్థాలు, అంతరార్ధాలు, టీకా  తాత్పర్యాలు ఇలా చాలానే ఉంటాయని పార్టీలో సీనియర్ నాయకులే అంటున్నారు. అలాగే ఇప్పుడు ముందస్తు లేదు అని ఖచ్చితంగా చెప్పేశారంటే.. ఆ మాటల వెనుక అర్ధాలు చాలానే ఉంటాయన్న చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. కేసీఆర్ చెప్పింది చేయరనీ, చేసేది చెప్పరనీ పార్టీ వర్గాలే కాదు రాజకీయ వర్గాలు కూడా అంటుంటాయి. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ముందస్తు ముచ్చటే లేదన్న కేసీఆర్ మాటల వెనుక నిగూఢార్థం ఉందని అంటున్నారు. వారి అంచనాకు తగ్గట్టుగానే కేసీఆర్  తీసుకుంటున్నచర్యలు, ప్రకటిస్తున్నపథకాలు, వేస్తున్న అడుగులూ అన్నీ కూడా ఎన్నికల దిశగానే వేగంగా సాగుతున్నాయి.

ఆయన తాజాగా మరోసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు, వచ్చే జనవరి 18 నుంచి రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ల జోళ్లు అందించాలని నిర్ణయించారు. అలాగే ఇటీవల నూతన సచివాలయ నిరాణాన్ని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునే విధంగా సచివాలయానికి ఎదరుగా అమర వీరుల స్థూపం నిర్మాణం జరుగుతోందని చెప్పి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ను స్పృశించారు. ఇటువంటి పథకాలు, ప్రారంభోత్సవాలు, సెంటిమెంట్ రగిల్చే చర్యలను కేసీఆర్ సరిగ్గా ఎన్నికల ముందే చేపడతారని గత అనుభవాలు చెబుతున్నాయి. 2018 ఎన్నికల ముందు కూడా కేసీఆర్ ఆర్భాటంగా కంటివెలుగు వంటి కార్యక్రమాలను చేపట్టిన సంగతి విదితమే.

అప్పట్లోనే విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పినప్పటికీ ఎన్నికల అనంతరం ఆ ఊసే ఎత్తేలేదు. ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా ఆయన కంటి వెలుగు రెండో విడతను తెరమీదకు తీసుకురావడంతో ఆయన ఎన్నికల సన్నాహాలు ప్రారంభించేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అలాగే సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం గురించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణం గురించి చెప్పడం ప్రజలలో ఉద్యమ సెంటిమెంట్ రగల్చడానికేనని చెబుతున్నారు. ఇక పరిశీలకులు కూడా కేసీఆర్ ముందస్తుకే అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తియన తరువాత మార్చిలో ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం వరకూ సాధ్యమైనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించి, ప్రారంభించి ప్రజాదరణను ప్రోది చేసుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ వ్యూహానికి అనుగుణంగానే తెరాస ఎన్నికల సన్నాహాలలో ముగినిపోయిందని చెబుతున్నారు. అంతే కాకుండా కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలపై ఇప్పటికే పూర్తి అవగాహన ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నికల సన్నాహాలు మొదలెట్టేశాయి. అయితే బడ్జెట్ తరువాత ఏ క్షణంలోనైనా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు నగారా మోగించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అసెంబ్లీ రద్దైన వెంటనే ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు వస్తుందా రాదా అన్నది చూడాల్సి ఉంది.

అసెంబ్లీ రద్దైన ఆరు నెలల లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. సో ఎన్నికల నిర్వహణకు సీఈసీ ఆరు నెలల వ్యవధినీ పూర్తిగా ఉపయోగించుకుంటే సెప్టెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారు.  ఈ వ్యూహంతోనే కేసీఆర్ ముందకు వెళుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెరాస వర్గాలూ అదే చెబుతున్నాయి. ముందస్తు ముచ్చట లేదని కేసీఆర్ అనడం వెనుక అంతరార్దం ఇదేననీ రాజకీయవర్గాలు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.