తెరపైకి మళ్ళీ ముందస్తు ముచ్చట!

Publish Date:Mar 9, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలలో రాటు తేలిన నాయకుడు. సందేహం లేదు. రాజకీయ వ్యూహ రచనలో ఆయనకు ఆయనే సాటి, సమకాలీన రాజకీయ నాయకుల్లో  ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆయనకు సమ ఉజ్జీగా నిలిచే నాయకుడు రాష్ట్ర నేతలలో మరొకరు లేరు.  నిజానికి  కేసీఆర్ విజయ రహస్యం కూడా అదే. ఆయన రాజీయ చాణిక్యమే ఆయన విజయ రహస్యం. ప్రత్యర్ధులను చిత్తు చేసే ఎత్తుగడలే ఆయన ప్రధాన రాజకీయ అస్త్రాలు అంటారు రాజకీయ విశ్లేషకులు.

 కేసీఆర్ గత కొంత కాలంగా చాలా మౌనంగా ఉంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్  మార్కు సందడి కనిపించడం లేదు. ఆయన ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు. అయితే, ఒక పక్షం రోజుల క్రితం కావచ్చును, ఆయన వరసగా మూడు నాలుగు రోజులు, బీఆర్ఎస్  ముఖ్యనేతలు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, ఆ చర్చలు ఎందుకు జరుపుతున్నారు? ఏమిటి చర్చిస్తున్నారు? అనేది ఎవరికీ తెలియక పోయినా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి మళ్ళీ మరోమారు ముందస్తు ఎన్నికలపై దృష్టిని కేద్రీకరించినట్లు తెలుస్తోందని కథనాలు వెలువడ్డాయి. అందులో భాగంగానే అభ్యర్ధుల ఎంపిక కసరత్తు చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. నిజానిజాలు ఎలా ఉన్నా ఆ తర్వాతనే,  అంతకు ముందు చెప్పినట్లుగా సిట్టింగులు అందరికీ మళ్ళీ టికెట్  రాక పోవచ్చని , కొందరికి మొండి చేయి తప్పదనే ప్రచారం జరిగింది. 

అదలా ఉంటే ఇప్పుడు మళ్ళీ ముందస్తు  ఊహాగానాలు తెరపైకొచ్చాయి.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు జారీ చేయడం, ఆమె అరెస్ట్ తప్పదనే సంకేతాలు వస్తున్న నేపధ్యంలో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో ముఖ్యమంత్రి కేసేఅర్ మళ్ళీ ముందస్తు ఎన్నికల చర్చను తెరపైకి తెచ్చారు.

నిజానికి  2018లో ఆరు నెలలు ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండవసారి అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో సెంటిమెంట్స్  కు పెద్దపీట వేసే కేసీఆర్, మూడవసారి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు.. మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హుజురాబాద్ ఓటమి తర్వాత ముఖ్యమంత్రి ముందస్తు ఆలోచనలు చేస్తున్నారనే కధనాలు   వస్తూనే ఉన్నాయి.  బీఆర్ఎస్ కీలక విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించిన ప్రతిసారి ఈ తరహా ఊహాగానాలను వినవస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో తొలి భారీ బహిరంగ సభగా పేర్కొన్న ‘ఖమ్మం సభ’ ముందూ వెనకా కొంత కాలం ఇదే ప్రచారం నడిచింది.  తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణ , అరెస్ట్ ఊహాగానాల మధ్య మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్  గురువారం(మార్చి9)   క్యాబినెట్ భేటీ నిర్వహించడం, మరుసటి  రోజు శుక్రవారం(మార్చి10) బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునివ్వడంతో మరో మారు ముందస్తు ఊహాగానాలు జోరుగా షికారు చేస్తున్నాయి.

కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయని, అందుకే ముఖ్యమంత్రి ముందస్తు చర్చను మరో మారు తెరపైకి తెచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇక్కడితో ఆగకుండా కాళేశ్వరం అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చేందుకు కాగ్ ను రంగలోకి దించినట్లు తెలుస్తున్న నేపధ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, హ్యాట్రిక్ సాదించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే  ఏదైనా  అంతిమ నిర్ణయం ఇప్పటిప్పుడు రాదని  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టయితే  ఆ తర్వాత  ప్రజల్లో ముఖ్య్మగా మహిళలలో ఏ మేరకు సానుభూతి వస్తుందనేది అంచనా వేసుకుని ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  

అదలా ఉంటే.. శనివారం(మార్చి 11) కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. అయితే ఈవిచారణ ఎన్ని రోజులు జరుగుతుంది .. అంతిమ నిర్ణయం ఎప్పుడు వస్తుంది  అనేది ఎవరి ఊహకు అందని విషయం. సో .. ముందస్తు వ్యూహాగానాలు ఎంతవరకు నిజమవుతాయి .. అనేది ఈడీ నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. మరోవైపు కవిత అరెస్టయితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తోందనే ప్రచారమూ ఉంది. మరి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయనేది వేచిచూడాల్సిందే.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.