తెలంగాణలో ముందస్తు ఎన్నికలు?

Publish Date:Aug 5, 2023

Advertisement

తెలంగాణలో షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా?  అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. వాస్తవంగా డిసెంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మాత్రం అక్టోబర్ మొదటి వారంలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని పక్కాగా చెబుతున్నారు. తనను కలిసిన పార్టీ నేతల వద్ద ఆయన ఇదే విషయాన్ని చెబుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకుని పని మొదలు పెట్టేయాలని సూచిస్తున్నారు.

 తెలంగాణలో బీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్వయంగా కేటీఆర్ పలు సందర్భాలలో చెప్పారు.  ఆయన పార్టీ శ్రేణులు, నేతలే కాదు.. టీఆర్ఎస్ శ్రేణులు కూడా ముఖ్యమంత్రి పగ్గాలు అందుకునేది, అందుకోబోయేది కేటీఆర్ అనే అంటున్నారు. అదే విశ్వసిస్తున్నారు కూడా. అందుకు తగ్గట్టుగానే బీఆర్ఎస్ రాజకీయం మొత్తం ఇప్పడు కేటీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి.  ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శన భాగ్యం ఇప్పుడు కీలక నేతలకు కూడా దుర్లభమే అన్నట్లుగా మారింది. పార్టీలో ఎవరైనా సరే కేటీఆర్ ను కలవాల్సిందే. ఆయన నిర్ణయమే ఫైనల్. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లు ఎవరికి ఎవరికి ఇవ్వాలి. సిట్టింగులలో ఎవరిని పక్కన పెట్టాలి అన్న విషయాలు కూడా కేటీఆర్ నిర్ణయం ప్రకారమే జరుగుతాయని పార్టీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో విస్పష్టంగా చెబుతున్నారు.

అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ కేటీఆర్ నిర్ణయం మేరకే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులంతా ఆయననే కలుస్తున్నారు.  ఇప్పటికే పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిన వారితో ఆయన వివరంగా మాట్లాడుతున్నారు. అలాంటి కన్ఫర్మేషన్ లేనివారిలో ఆయన ముభావంగా ముచ్చటిస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక టికెట్ గ్యారెంటీ అన్న నేతలతో వేరుగా మాట్లాడుతూ ఎన్నికలు అక్టోబర్ మొదటి వారంలోనే జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, సమయం వృధా చేయకుండా  క్షేత్ర స్థాయిలో పని చేసుకోవాలని చెబుతున్నారని అంటున్నారు.  తెలంగాణ అసెంబ్లీకి 2018లో డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ మేరకు 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే  తనకు ఉన్న సమాచారం ఎక్కడిదో, ఏమో తెలియదు కానీ కేటీఆర్ మాత్రం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మూడు నెలలు ముందుగానే అంటే అక్టోబర్ మొదటి వారంలోనే జరుగుతాయని పార్టీ నేతలకు నమ్మకంగా చెబుతున్నారు.  ఎన్నికల సంఘానికి  షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంది.

అంతే కాకుండా తెలంగాణతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఈ ఏడాదే ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో జరుగుతాయని భావించాల్సి ఉంటుంది. అదే జరిగితే  వచ్చే ఏడాది జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు కూడా ముందుకు జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అంటే ఏపీ అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లేనని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఏపీ సహా ఏడేనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు జరగాలి వాటిని కూడా రెండు మూడు నెలలు ముందు జరిగే అవకాశాలున్నాయనీ. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు కూడా అలాగే ఉన్నాయనీ విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.