డిసెంబర్ లేదా జనవరిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు?

Publish Date:May 21, 2023

Advertisement

నిజం కావచ్చును  ..కాకపోనూ వచ్చును, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ మరోమారు ముందస్తు ఎన్నికల చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి, తెలుగు దేశం పార్టీ అధినేత  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఎప్పటి నుంచో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ముందస్తు ఎన్నికలు పోవడం ఖాయమని చెపుతూనే ఉన్నారు. అయితే  ముందస్తు ఎన్నికలు వస్తాయా  రావా అనే విషయాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని చిత్తుగా ఓడించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

కార్యకర్తలలో జోష్ పెంచేందుకు విభిన్న కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు. ఓ వంక యువనేత నారా లోకేష్, యువ గళం పాద యాత్ర తో జన ప్రభంజనం సృష్టిస్తున్నారు. మరో వంక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానిక నేతలు, కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అనేందుకు నియోజక వర్గాల స్థాయిలో క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు. 

అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సాహసం చేయక పోవచ్చనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్త పరుస్తున్నా, చంద్రబాబు నాయుడుతో పాటుగా, ఇప్పటికే టీడీపీతో పొత్తుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల ముందస్తు ముచ్చట తెచ్చారు.ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నెల నుండి పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

అలాగే వైసీపీ అసమ్మతి నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారని చెప్పారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన ముహూర్తాలు కూడా ఖరారు చేశారు. గతంలో కర్ణాటక ఎన్నికలతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పిన రఘురామకృష్ణం రాజు  , తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.  

ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మనసు మారకపోతే, డిసెంబర్ లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఐక్యం కాకముందే ఎన్నికలకు వెళ్లాలన్నది ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ గా కనిపిస్తోందన్నారు. అయితే ఓట్లున్న ప్రతిపక్షాలు కలవడం ఖాయమని అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వారితో కలిసే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణ రాజు అన్నారు. 

అదలా ఉంటే  ఇప్పడు తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం (2023)డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం (2024)జనవరిలో ఎన్నికలువస్తాయని స్పష్టం చేశారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అదెలా ఉన్నా ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలు కోరుకొవడానికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.

ముఖ్యంగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కారణాలు ఏవైనా కేంద్ర ప్రభుత్వం  అండదండలు అడుగంటిపోతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరోవంక అక్రమాస్తుల కేసులు, బాబాయి మర్డర్ కేసుకు సంబందించిన చిక్కు ముళ్ళు తొలిగి పోతున్నాయి. ఈ నేపధ్యంలో ఏ నిముషానికి ఏమి జరుగుతుందో అనే భయం వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో గుడ్డిదో ఎడ్డిడో దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.