వలసబాటలో ఇంటర్ విద్యార్దులు
Publish Date:Aug 14, 2012
Advertisement
గత సంవత్సరం ఎమ్సెట్ కౌన్సిలింగ్ను జూలై 13 నుండే మొదలు పెట్టారు. జూలై 1న ర్యాంకుల విడుదల, రెండవవారం నుండే కౌన్సిలింగ్ ప్రారంభించడం జరిగింది. సర్టిఫికెట్లు పరిశీలనాంతరం జూలై 22, 23 తేదీల్లో లక్షలోపు ర్యాంకులు గల విద్యార్దులకు ఆప్షన్లు ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించారు.కానీ ఈ విద్యా సంవత్సరం ఆగస్టు రెండోవారం గడచిపోయినా ఇంతవరకు కౌన్సిలింగ్ తేదీలను కూడా ప్రకటించలేదు. కౌన్సిలింగ్ తేదీలు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. రెండు మూడు నెలలముందు జరగాల్సిన ఫీజుల పెంపు ప్రక్రియను ప్రభుత్వం తాపీగా ఇప్పుడు ఆరంభించింది. దీంతో విద్యార్దుల భవిష్యత్తు ప్రశ్నార్దకంగా మారింది. ఇప్పటికే నెల ఆలస్యమైన కౌన్సిలింగ్ ఎప్పటికి ప్రారంభం అవుతుందో కూడ తెలియని అయోమయంలో విద్యార్దులు ఉన్నారు. ఇంతవరకు ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించక పోవడానికి కారణం యాజమాన్యాల ప్రయోజనాలను కాపాడటానికే అని విద్యార్దుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా విద్యార్దులే బలిపశువులుగా మారుతున్నారు.విద్యార్ది జీవితం మొత్తంలో ఇంటర్మీడియట్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశం కీలకం కాబట్టి విద్యార్దులు ప్రతిరోజు ఉద్వేగంగా ఎదురు చూస్తుంటారు.ఈ ఉత్కంటతో కౌన్సిలింగ్కు జరుగుతున్న కాలయాపనల వల్ల ఇప్పటికే వేలాది మంది విద్యార్దులు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లారు. మరి కొంత మంది మన రాష్ట్రంలోనే ఉన్న డీమ్డ్ విశ్వవిద్యాలయాలలో చేరారు. ఇలా చేరిన విద్యార్దుల శాతం 30 కి వుంటుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఆర్ధికంగా స్తోమత లేనివారు మాత్రం కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నారు.
http://www.teluguone.com/news/content/eamcet-students-moving-to-another-state-24-16502.html





