ఔను నిజమే.. ఇ20 పెట్రోల్ మైలేజీ ఇవ్వదు.!

Publish Date:Jul 31, 2026

Advertisement

ఎట్టకేలకు అంగీకరించిన కేంద్ర మంత్రి గడ్కరీ.! ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాహనాల మైలేజీని తగ్గిస్తుందన్న మాట నిజమేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎట్టకేలకు బహిరంగంగా అంగీకరించారు.  పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం ద్వారా వాహనాల మైలేజ్ తగ్గిపోతోందని, ఇంజిన్లు పాడవుతున్నాయని వాహనదారులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఇంత కాలంగా కేంద్రం ఆ ఆందోళనలను, ప్రచారాన్ని పెడచెవిన పెట్టింది. అయితే ఎట్టకేలకు పార్లమెంటు వేదికగా, వాహనదారులలో పెరుగుతున్న   అనుమానాలు, ఆందోళనలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై గడ్కరీ నోరు విప్పారు.  

ఇథనాల్ బ్లెండింగ్ (ఇ20) పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్‌పై ప్రభావం పడుతుందని అంగీకరించారు. పార్లమెంటు వేదికగా మాట్లాడిన గడ్కరీ.. అయితే వాహనదారులు ఆందోళన చెందాల్సినంతగా ఇ20 పెట్రోలు వల్ల మైలేజీ తగ్గదని వివరించారు. ఇ20 పెట్రోల్ కారణంగా మహా అయితే.. వాహనాల మైలేజీ ఆరు శాతం తగ్గుతుందన్నారు.  

కేంద్ర మంత్రి గడ్కరీ పార్లమెంట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, వాహనం రకం,  మోడల్   వినియోగించిన కాలం ఆధారంగా ఈ మైలేజ్ తగ్గుదల అనేది 2 నుంచి 6 శాతం  మధ్య ఉంటుందని  పరిశోధనల్లో తేలింది. ఇథనాల్‌లో ఉండే కలోరిఫిక్ విలువ పెట్రోల్ కంటే తక్కువగా ఉండటమే ఈ స్వల్ప మైలేజ్ తగ్గుదలకు  కారణమని గడ్కరీ చెప్పారు. ఇండియా  ముడి చమురు దిగుమతులపై  ఆధారపడటాన్ని తగ్గించడానికి,  పర్యావరణ పరిరక్షణకు  కేంద్రం  E20 ప్రాజెక్ట్‌ను తీసుకువచ్చిందన్న ఆయన.. ఈ ఏడాది ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఇంధన విక్రయ కేంద్రాలలో ఇ20 పెట్రోల్ విక్రయాలను  తప్పనిసరి చేసినట్లు చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వ  నిర్ణయంపై   వాహనదారుల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

ఇదిలా ఉంటే, ఇథనాల్ బ్లెండింగ్ విధానంపై గడ్కరీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  గడ్కరీ కుమారుడు నిఖిల్ గడ్కరీతో సంబంధం ఉన్న సియాన్ ఆగ్రో   అనే సంస్థ ఆదాయం ఇథనాల్ విధానం అమలులోకి వచ్చాక విపరీతంగా పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్‌ను వేగవంతం చేస్తోందని విపక్షాలు విమర్శస్తున్నాయి. ఈ20  పెట్రోల్ రేట్లు తగ్గకపోవడం,   మైలేజ్ కూడా 6 శాతం వరకు తగ్గడంతో సామాన్య వాహనదారులు సైతం కేంద్రం నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడ్కరీ మైలేజీ తగ్గుదల వాస్తవమే అని ఒప్పుకున్న నేపథ్యంలో   ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని పాత వాహనదారులకు ఉపశమనం కలిగించేలా, ఇంధన నాణ్యత,  ధరలపై స్పష్టత ఇచ్చి.. వాహనదారులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. 

Nitin Gadkari ethanol blending, E20 fuel efficiency, ethanol petrol mileage loss, Cian Agro Gadkari controversy

By
en-us Political News

  
ఒకప్పుడు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని ఎలా మార్చిందో.. అచ్చం అలాగే.. ఆ మాటకొస్తే అంతకు మించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రలో ఆర్థిక విప్లవాన్ని తీసుకురాబోతోంది.
బజాజ్ ఫైనాన్స్ క్యూ1 ఆర్థిక ఫలితాల్లో రూ. 5,986 కోట్ల నికర లాభం సాధించడంతో షేరు ధర 6% పైగా దూసుకెళ్లింది. మోతీలాల్ ఓస్వాల్ బై రేటింగ్ ఇచ్చి రూ. 1,300 టార్గెట్ ధార్యాన్ని ప్రకటించిన వేళ సమగ్ర విశ్లేషణ.
Google DeepMind విడుదల చేసిన Gemini Robotics 2.0 సాంకేతికత, 92% విజయవంతమైన హోల్ బాడీ కంట్రోల్, అధునాతన సేఫ్టీ బెంచ్‌మార్క్స్ మరియు విప్లవాత్మక ఫీచర్లతో రోబోటిక్స్ రంగాన్ని ఎలా మార్చేస్తుందో పూర్తిగా తెలుసుకోండి.
టవర్లు లేకున్నా మీ మొబైల్‌కు డైరెక్ట్ సిగ్నల్స్ అందించేందుకు అమేజాన్ 5,105 ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది. అమేజాన్ లియో D2D ప్రాజెక్ట్, గ్లోబల్‌స్టార్ డీల్ మరియు లాంచ్ టైమ్‌లైన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
గత కొన్ని రోజులుగా ఆయన నాడీ వ్యవస్థను, మెదడు పనితీరును సాధారణ స్థితికి తెచ్చేందుకు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది.
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్! ఇకపై బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడానికి రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏఐ సహాయంతో 1,072 బగ్స్‌ను సరిచేసి డైనమిక్ ప్యాచింగ్ సాంకేతికతను తీసుకొస్తున్న గూగుల్ విప్లవాత్మక అప్‌డేట్ వివరాలు ఇవే!
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 8న ప్రారంభం కానుంది. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25, 4K టీవీలపై భారీ ఆఫర్లు, ఎస్బీఐ కార్డ్‌పై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు ప్లస్ మెంబర్లకు ఆగస్టు 7 నుంచే ఎర్లీ యాక్సెస్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల FPI కొనుగోళ్ల జోరు పెరిగింది. ఒకే రోజులో ₹8,831.1 కోట్ల రికార్డు పెట్టుబడులతో పాటు నిఫ్టీ, సెన్సెక్స్ విశ్లేషణ, ఐపీఓ పెట్టుబడులు మరియు మార్కెట్ ట్రెండ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
MV ఎలక్ట్రోసిస్టమ్స్ IPO రోజువారీ GMP, సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, షేరు ధర మరియు రైల్వే ప్రొపల్షన్ ఆర్డర్ బుక్ వివరాలను తెలుసుకోండి. మధురి కేలా మద్దతు ఉన్న ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టవచ్చా లేదా బ్రోకరేజ్ విశ్లేషణ ఇక్కడ చూడండి.
కామన్వెల్త్ గేమ్స్ 2026 డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించిన తల్లి, పీహెచ్‌డీ స్కాలర్ సీమా కాళిరామ్నా స్ఫూర్తిదాయక కథ. 11 నెలల బాబును వదిలి సాధించిన ఈ చారిత్రాత్మక విజయం విశేషాలు చూడండి!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ శుభారంభం! వెయిట్‌లిఫ్టింగ్ రికార్డుతో లవ్‌ప్రీత్ సింగ్ రజతం సాధించగా, డిస్కస్ త్రోలో సీమా కాలిరామ్నా కాంస్యం గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా ఫైనల్ విశేషాలు ఇవే!
ఘటన జరిగిన సమయంలో భవనంలో పాతిక నుంచి ముఫ్ఫై మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలకు కూడా సాధ్యంకాని అజేయ టెస్ట్ కెప్టెన్సీ రికార్డు, 36 ఆలౌట్ తర్వాత ఆస్ట్రేలియాలో సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయం మరియు రహానే కెరీర్ విశేషాల సమాచారం ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.