మండలిలో దువ్వాడ నోటి దురుసు.. డిప్యూటీ స్పీకర్ స్పందనేంటంటే?

Publish Date:Aug 19, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా ప్రజాప్రతినిధుల మధ్య రాజకీయ విమర్శలు మరోసారి హద్దులు దాటాయి. మండలి సమావేశాల్లో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఉన్నతమైన చట్టసభలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రిపై ఇలాంటి పదజాలం ఉపయోగించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

వైసీపీ నేతల నోట దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు అంతూ పొంతూ అనేది ఉండదని మరోసారి రుజువైంది. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాభవానికి, ఆ పార్టీ అధినేత నేడు అసెంబ్లీకి ముఖం చాటేయడానికీ, ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలు కూడా దక్కకపోవడానికి ప్రధాన కారణాలలో వైసీపీ నేతల బూతు పురాణం కూడా ఒకటన్నది తెలిసిందే. వైసీపీ నేతల దూషణలు, తిట్లు, బూతుపురాణాలపై ప్రజలు తన ఆగ్రహాన్ని, వ్యతిరేకతను 2024 ఎన్నికలలో తమ ఓటు ద్వారా విస్పష్టంగా తెలియజేశారు. అయినా వైసీపీయులలో ఇసుమంతైనా మార్పు రాలేదనడానికి  తాజాగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ నోరు పారేసుకోవడాన్ని పరిశీలకులు   ఉదాహరణగా చూపుతున్నారు. 

మండలిలో దువ్వాడ ప్రసంగిస్తూ.. మంత్రి అచ్చెన్నాయుడిని అంబోతు అని సంబోధించారు. ఏకంగా  డిప్యూటీ చైర్మన్ తోనే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడేనా.. అధ్యక్షా ఆ అంబోతును రమ్మనండి అని వ్యాఖ్యానించారు.   ఒక సీనియర్ మంత్రిని,  ఇలా సంబోధించడం సభామర్యాదకు భంగకరం అనడంలో సందేహం లేదు. అన్నిటికీ మించి మంత్రిని వాడు, ఆంబోతు అని దువ్వాడ శ్రీనివాస్ దూషణ భాషలో మాట్లాడితే డిప్యూటీ చైర్మర్  వారించడం, అభ్యంతరం తెలపడం మాని చిరునవ్వుతో ప్రోత్సహిస్తున్నట్లుగా వ్యవహరించడం మరింత దారుణమని పరిశీలకులు అంటున్నారు.  సభాధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తులు తటస్థంగా వ్యవహరించాలి, అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి, అటువంటి వ్యాఖ్యలు చేసిన సభ్యులను మందలించాలి. హెచ్చరించాలి. కానీ డిప్యూటీ స్పీకర్ అందుకు భిన్నంగా చిరునవ్వులు చిందించడం దారుణం. ఆయన తీరుపై సభ్యులలోనే కాదు.. సామాన్య జనంలో కూడా విస్మయం, ఏహ్యత వ్యక్తమౌతోంది.  

Duvvada Srinivas, Atchannaidu, AP Legislative Council, YCP MLC, APpolitics, TeluguOne

By
en-us Political News

  
వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన..
రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 
చెన్నైలోని తిరువికా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీవీకే తరఫున విజయం సాధించిన పల్లవి తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ప్రజాప్రతినిధిగా    సభకు  బిడ్డతో హాజరుకావడం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గత ప్రభుత్వం జీవోల ద్వారా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24.15 శాతానికి  తగ్గించిందని, ఇందు వల్ల దాదాపు 16 వేల 800 మంది బీసీ నాయకులు తమ రాజకీయ అవకాశాలను, ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని చంద్రబాబు వివరించారు.
 ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన విజయసాయి..   ప్రజల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించే బలమైన గొంతుకగా తాను నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తూమాటి మాధవరావు శాసనమండలి కార్యదర్శికి  తన నామినేషన్ పత్రాలను   సమర్పించారు. రాష్ట్ర శాసనమండలిలో  వైసీపీకి సంఖ్యా బలం స్థానం ఉండటంతో..  డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. 
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.