బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఏజిల్ కు దుర్గగుడి సెక్యూరిటీ టెండర్ ఖరారు
Publish Date:Jun 1, 2022
Advertisement
ఏపీ ప్రభుత్వ దుర్నీతి మరోసారి బట్టబయలైంది. విజయవాడ దుర్గ గుడి సెక్యూరిటీ టెండర్ ను సెక్యూరిటీ నిర్వహణలో ఘోరంగా విఫలమై బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఏఝిల్ సంస్థ దక్కించుకుంది. తెలంగాణలోని ప్రతిష్టాత్మక వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి సెక్యూరిటీ నిర్వహణలో ఘోరంగా విఫలమైన ఏజిల్ బ్లాక్ లిస్ట్ లో చేరింది. వరంగల్ ఎంజీఎంలో ఎలుకల దాడి చేసిన ఘటనలో ఓ రోగి మృతి చెందాడు. అప్పట్లో ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు, సెక్యూరిటీ సంస్థపై చర్యలకు ఉపక్రమించారు. అప్పటికి ఎంజీఎం సెక్యూరిటీ సంస్థ అయిన ఏజిల్ ను బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. అటువంటి సంస్థకు దుర్గగుడి సెక్యూరిటీ టెండర్ కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో అదీ విజయవాడలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం జరిగిన ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ వైఫల్యం కూడా ఏజిల్ దే. ఏరి కోరి విఫల సంస్థకు సెక్యూరిటీ టెండర్ కట్టబెట్టిన ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థ దుర్గగుడి సెక్యూరిటీకి టెండర్ ఎలా వేసిందని, అటువంటి సంస్థకు టెండర్ ఎలా కట్టబెడతారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటైన దుర్గ గుడి సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించడం దారుణమని, వెంటనే ఆ టెండర్ ను రద్దు చేయాలని డిమాండ్ వెల్లువెత్తుతోంది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఏజిల్ కు దుర్గగుడి సెక్యూరిటీ టెండర్ కట్టబెట్టిన విషయం ఆర్టీఐ సమాచాచం ఆధారంగా బయటపడింది. బ్లక్ లిస్ట్ లో ఉన్న సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం అదీ అత్యంత ప్రతిష్టాత్మకమైన, నిత్యం భక్తుల రద్దీతో కిక్కిరిసి ఉండే దుర్గ గుడి సెక్యూరిటీ అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత లేకపోయినా నిబంధనలను పక్కన పెట్టి మరీ దుర్గగుడి సెక్యూరిటీ టెండర్ ను ఏజిల్ సంస్థకు కట్టబెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై దుర్గ గుడి అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. విజయవాడ దుర్గగుడిలో సెక్యూరిటీ టెండర్లను ఫిబ్రవరిలో నిర్వహించగా మూడు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. వాటిలో అత్యధిక టర్నోవర్ ఉన్న ఏజిల్ సంస్థకు సెక్యూరిటీ టెండర్ ఇచ్చారు. అయితే దుర్గగుడి సెక్యూరిటీ టెండర్లకు సంబంధించి అత్యధిక టర్నోవర్ నిబంధనపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. టర్నోవర్ ఉన్నంత మాత్రాన బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఏజిల్ కు సెక్యూరిటీ టెండర్ కట్టబెట్టడమేమిటని జనం ప్రశ్నిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/durga-gudi-security-tender-to-agile-which-is-in-black-list-25-136814.html





