జోడు వాదాలు జంట పదవులు.. బీఆర్ఎస్ ప్రస్థానం సాధ్యమేనా?

Publish Date:Oct 5, 2022

Advertisement

అనుకున్నట్లే జరిగింది. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) భారత రాష్ట్ర  సమితి (బీఆర్ఎస్) గా పేరు మార్చుకుంది. జాతీయ పార్టీగా ఎదిగే దిశగా తొలి అడుగు వేసింది. తెరాస /బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు 68 ఏళ్ల వయసులో తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అయితే, పేరు మారినా, ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా కొత్తగా ప్రస్థానం మొదలు పెట్టినా, పార్టీ కార్యక్షేత్రం మార లేదని, కొత్త, పాత పార్టీల వ్యవస్థాపక అధ్యక్షుడి హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  స్పష్టం చేశారు. భారత రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నాన్నామని చెప్పారు. అంతే కాదు, ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే, దేశమంతా పర్యటిస్తానని కేసేఆర్ స్పష్టం చేశారు. అలాగే, కార్యక్షేత్రం వదిలేది లేదని  ఈ విషయంలోనూ  ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని  చెప్పారు. 

అయితే నిజంగానే కేసీఆర్ ఎప్పటిలా జోడు పదవుల్లో కొనసాగుతారా? సమయం సందర్భం చూసుకుని, ముఖ్యమంత్రి పదవిని మరొకరికి అప్పగిస్తారా అనేది చూడవలసి వుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి స్వయంగా కేసీఆర్ చేసిన నిన్నటి (బుధవారం) ముగింపు ప్రకటన వరకు ఆయనే తెరాస  పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. అలాగే, 2014 నుంచి ఈ రోజు వరకు పార్టీ అధ్యక్ష పదవితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ  జోడు పదవులలో కొనసాగుతున్నారు. అఫ్కోర్స్, కుమారుడు కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా  చేదోడు వాదోడుగా ఉన్నారనుకోండి  అది వేరే విషయం. 

అయితే రాష్ట్ర  స్థాయిలో సాధ్యమైన జోడు పదవుల స్వారీ జాతీయ స్థాయిలో సాధ్యమవుతుందా? ఈ ఏర్పాటు ఎంత కాలం కొనసాగుతుంది? అనేది ఇప్పుడే తెలిసే విషయం కాదు. నిజమే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవితో పాటు, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా జోడు పదవులు తనకే కావాలని కోరుకున్న ఆ రాష్ట ముఖ్యమంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక గెహ్లాట్ కు ఎదురైన అవరోధాలు, అడ్డంకులు, కేసేఆర్ కు లేవు. కాంగ్రెస్ పెట్టుకున్న ఒక వ్యక్తికి ఒకే పదవి నియమం తెరాస  పెట్టుకోలేదు. అంతేకాదు, అది తెరాస అయినా బీఆర్ఎస్ అయినా గులాబీ పార్టీ కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే కాబట్టి రాజస్థాన్ పరిణామాలను ఇప్పటి కిప్పుడు తెలంగాణలో ఉహించలేము.  
కానీ కేంద్ర ఎన్నికల సంఘం తెరాస పేరు మార్పును అధికారికంగా గుర్తించి తెరాస అధ్యక్షుడు కేసేఆర్, బీఆర్ఎస్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత  సంస్థాగత మార్పులు చేపట్టక తప్పక పోవచ్చును. అలాగే అలాంటి ఆలోచన గులాబీ బాసుకు లేక పోలేదని అంటున్నారు. అయితే తెరాస పేరు మార్పు అనుకున్నట్లుగా ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుందా  లేదా అనేది, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని  సో అంత వరకు  సంస్థాగత మార్పులు ఉండవనే అంటున్నారు.

అదలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వంక జాతీయ వాదాన్ని ఎత్తు కుంటూనే, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదాన్ని వదిలేది లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ తనకున్న అనుభవంతో జోడు పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించ వచ్చునేమో కానీ, జోడు విధానాలను, జోడు వాదాలను ఎలా, సమన్వయ పరచు కుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా వుందని అంటున్నారు. రెండు దశాబ్దాల తెరాస చరిత్ర కేసీఆర్ రాజకీయ జేవిత చరిత్ర మొత్తం తెలంగాణ కేంద్రంగానే సాగిందనేది కాదన లేని నిజం.   

కేసేఅర్ కు జాతీయ స్థాయిలో ఏదైనా గుర్తింపు ఉందంటే, అది తెలంగాణ ఉద్యమ నేతగా, తెలంగాణ అస్తిత్వ వాదంతో ముడిపడి ఉన్నగుర్తింపే  కానీ మరొకటి కాదు. అయితే, ఆ ప్రస్తావన ఎక్కడా రాకుండా, ఎనిమిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలనే జాతీయ ఎజెండాలో చేర్చారు.

అందులోనూ ప్రధానంగా సంక్షేమ పధకాలను, మరీ ముఖ్యంగా కౌలు రైతలకు కాదని, వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఆస్తులు ఉన్న మంత్రి మల్లారెడ్డి వంటి భూస్వాములు, రాజకీయ, వ్యాపార రంగాలలో స్థిరపడిన ధనినికులు, ప్రభుత్వ ఉద్యోగులకు సహా భూస్వాములకు ప్రజల సొమ్మును దోచి పెడుతున్నారనే ఆరోపణలున్న రైతు బంధు, ఇంకా రాష్ట్ర్రంలోనే పూర్తి స్థాయిలో పట్టాలేక్కని  దళిత బంధు, గిరిజనబంధు వంటి పథకాలనే తెలంగాణ మోడల్ గా ప్రముఖంగా పేర్కొంటున్నారు. ఈ ఎజెండాను దేశ ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనేది ఎలా ఉన్నా, జంట పదవులు, జోడు వాదాలలో బీఆర్ఎస్ ప్రస్థానం ఎలా ముందుకు సాగుతుంది అనేది, చూడవలసి ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.