ప్రపంచ వ్యాప్తంగా బుధవారం (డిసెంబర్ 31) రాత్రి నుంచి గురువారం (జవవరి 1) తెల్లవారు జాము వరకూ నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. విశ్వనగరం హైదరాబాద్ లో కూడా నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ పలు ఈవెంట్లు జరిగాయి. న్యూ ఇయర్ వేడుకలలో నగర యువత యువత ఆటపాటలతో సందడి చేశారు. సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో మందుబాబులు కూడా పండుగ చేసుకున్నారు. పబ్ లు బార్ లలో అర్ధరాత్రి వరకూ తాగి చిందులేశారు. అక్కడితో ఆగకుండా నిబంధనలను ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసులకు పట్టుబడిన వారి సంఖ్య కూడా హైదరాబాద్ లో అధికంగానే ఉంది.
మద్యం సేవించి రోడ్లపైకి వాహనాలతో వచ్చిన వారికి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. నగర వ్యాప్తంగా అన్ని కీలక ప్రాంతాలలోనూ డంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అడ్డుకున్నారు. భారీగా జరిమానాలు విధించారు. గురువారం డిసెంబర్ 31) అర్ధరాత్రి ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,198 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/drunk-and-drive-cases-on-new-year-eve-36-211881.html
దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమించారన్న ఆరోపణలపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు నమోదు అయింది.
కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటం.. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే అప్రమత్తమై ఆయనను ఒడ్డుకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయనను వేరే పడవలోనికి చేర్చారు.
నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే పాతాళ మెట్ల మార్గానికి సమీపంలోనే స్థానికుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి చోట చిరుత సంచారం భయాందోళనలకు కలిగిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీలో 5 బిల్లులు ఆమోదం తెలిపింది
ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రకంగా పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా కఠిన చట్టాన్ని తీసుకువచ్చిన తొలి దేశంగా నిలిచింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో పయనిస్తూ 15 ఏళ్ల వయస్సును డిజిటల్ మెజారిటీ గా నిర్ణయించింది.
ఇటీవలే ముంబైలో రెండవ విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యింది. ఆ విమానాశ్రయం ప్రతిపాదన దశ, నిర్మాణాలను పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభం కావడానికి దాదాపు పాతికేళ్లు పట్టింది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై విషయంలోనే పరిస్థితి ఇది. ఇక గత దశాబ్ద కాలంగా బెంగళూరులో రెండవ విమానాశ్రయ నిర్మాణం కోసం స్థల అన్వేషణ ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది.
దట్టమైన పొగమంచు కారణంగా డిల్లీ నుంచి శంషాబాద్‌కు రావా ల్సిన, అలాగే శంషాబాద్ నుంచి డిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా ఈ విమానాలు రద్దు కావడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన, తిరుపతి నుంచి శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమనాలు పొగ మంచు కారణంగా ఆలస్యమయ్యాయి.
ఐబొమ్మ రవిని మూడ దఫాలుగా కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు రవి టెలిగ్రామ్ యాప్ ద్వారా నేరుగా సినిమా కంటెంట్‌ను కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. సాధారణ సినిమా లకు ఒక్కో సినిమాకు సగటున 2 డాలర్లు చెల్లించగా, పెద్ద హీరోల సినిమాల విషయంలో మాత్రం భారీగా 500 డాలర్లు వరకూ చెల్లించినట్లు నిర్ధారించారు.
ఇందర్జీత్, అతడి అనుచరుల నివాసాలపై జరిపిన సోదాలలో మొత్తం 48 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాలు సోమవారం ఆరంభమై, బుధవారం అర్దరాత్రి దాటే వరకూ కొనసాగాయి.
పది అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహ నాలు, కార్లు, భారీ వాహ నాలు అన్నీ హెడ్‌లైట్లు వేసు కుని నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదైంది. కొత్త సంవత్సర వేడుకలకు జపాన్ ముస్తాబవుతున్న వేళ భూమి కంపించడంతో జనం భయంతో వణికిపోయారు.
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 233 ప్రాంతంలో చికెన్ షాప్ నిర్వహిస్తున్న మహమ్మద్ ఇర్ఫాన్ ఉద్దిన్ జింక మాంసం విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్టు అధికారులు అతడి షాపులో తనిఖీలు నిర్వహించి జింక మాంసాన్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు, లక్ష్మీ సుజాతల కుమారుడు మురళీకృష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడేళ్ల కిందట అంటే అతడు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. స్నేహితులతో పందెం కాసి పెన్ను మింగేశాడు. ఆ విషయం ఇంట్లో చెప్పలేదు.