మునగాకు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ వ్యక్తులు తినకూడదట..!

Publish Date:Feb 18, 2026

Advertisement


మునక్కాడల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.  మునక్కాడలను వివిధ వంటకాల తయారీలో వాడుతూ ఉంటారు. అయితే మునగాకు గురించి చాలామందికి తెలియదు. పల్లె ప్రాంతాలలో విరివిగా మునగ చెట్లు పెరుగుతూ,  మునగాకు విరివిగా లభించినా వాటిని ఆహారంలో భాగం చేసుకునేవారు మాత్రం చాలా తక్కువే.. అయితే చాలా ప్రాంత ప్రజలు మాత్రం మునగాకులో ఉన్న పోషకాలను,  మునగాకు ఉపయోగాలను తెలుసుకుని డబ్బు వెచ్చించి మరీ మునగాకు కొని ఆహారంలో తీసుకుంటారు.  అయితే మునగాకు ఆరోగ్యానికి మంచిదే అయినా,  మునగాకును తినడం కొందరికి మంచిది కాదు.  ఇంతకీ మునగాకు ఎవరు తినకూడదు? ఎందువల్ల తినకూడదు? తెలుసుకుంటే..

మునగాకు పోషకాలు..

మునగలో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఉంటుంది.  అలాగే విటమిన్-ఎ,  విటమిన్-సి, విటమిన్-ఇ,  కాల్షియం,  పొటాషియం,  ఐరన్, ఫైబర్,  యాంటీ ఆక్సిడెంట్లు,  బీటా కెరోటిన్,  బీటా క్వెర్సెటిన్ వంటివి మాత్రమే కాకుండా.. అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి.

మునగాకు ఎవరు తినకూడదు..

థైరాయిడ్..

థైరాయిడ్ సమస్యలతో ఉన్నవారు మునగ తినడం చాలా ప్రమాదం అంటున్నారు.  ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యను కలిగిస్తుంది.  థైరాయిడ్ సమస్య ఉన్నవారు మునగ తినడం మానుకోవాలని చెబుతున్నారు.

లో బిపి..

మునగ ఆకులలో అధిక మొత్తంలో ఆల్కలాయిడ్లు ఉంటాయి.  దీని వల్ల లో బిపి సమస్య ఉన్నవారికి మునగాకు తినడం వల్ల సమస్య పెరుగుతుంది.

గర్బిణీ స్త్రీలు..

గర్బిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా లేకుండా మునగ తినకూడదని అంటున్నారు.  ఇది గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతారు.  

సెన్సిటివ్ స్టమక్..

కడుపు సున్నితంగా ఉండేవారు ఉంటారు.  ఇలాంటి వారు మునగ తీసుకోవడం చాలా పరిమితం చేయాలి.  కడుపు సున్నితంగా ఉండేవారు మునగాకు తీసుకుంటే విరేచనాలు,  తీవ్రమైన కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

                             *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్,
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా...
నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది..
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం. శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి, ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది. శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు...
ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు....
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం..
మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.  తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు.  నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు..  ఎప్పుడు తినాలనే విషయం  కూడా అంతే ముఖ్యమని..
డయాబెటిస్ ఉన్నవారిలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత? నార్మల్ షుగర్ లెవల్స్, HbA1c విలువలు, ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ కంప్లికేషన్స్ గురించి డా. హరిచరణ్ వివరించిన పూర్తి సమాచారం...
ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి...
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలను సహజంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కాలు, జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ఆయుర్వేద ద్రవ్యాల ప్రయోజనాలు, శరీరంలో కొవ్వు తగ్గించే మార్గాలు, ఆరోగ్యకరమైన బరువు నియంత్రణపై ఉపయోగకరమైన సమాచారం అందించబడింది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది...
నేటికాలంలో వేగవంతమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, బరువు పెరగడం ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక బరువు వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసుకున్న తర్వాత చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు...
స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి... వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం ఏమిటి.. జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు, బ్రేక్‌ఫాస్ట్ ప్రాముఖ్యత, టిఫిన్‌లో పెట్టాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. పి. జానకి శ్రీనాథ్ వివరించిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి...
కాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు  రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.