గచ్చిబౌలి డ్రగ్స్ పార్టీ కేసులో ఐఏఎస్ అధికారి కుమారుడికి డ్రగ్స్ పాజిటివ్!

Publish Date:Apr 3, 2026

Advertisement

హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని కొండాపూర్ “క్వాక్ ఏరినా” పబ్‌లో నిర్వహించిన నైట్ పార్టీ డ్రగ్స్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన డీజే బ్లాక్ కాఫీలో పాల్గొన్న ఈ ఈవెంట్‌కు  1500 మందికి పైగా  హాజరైనట్లు సమాచారం. పార్టీలో పాల్గొన్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళాఐఏఎస్ అధికారి కుమారుడికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం బయటపడటంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. డ్రగ్స్ పరీక్షల్లో మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఆరుగురికి గాంజా, ఒకరికి, మరొకరికి మెథాంఫెటమైన్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అంటే ఈ పార్టీలో మొత్తం మూడు రకాల మత్తు పదార్థాల వినియోగం జరిగినట్లు నిర్ధారణ అయింది.

ఈ నైట్ పార్టీకి భారీ స్థాయిలో ఖర్చు  చేసినట్లు తెలుస్తోంది. టేబుల్ బుకింగ్ ధరలు రూ.10,000 నుంచి రూ.2 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. సౌత్ ఆఫ్రికాకు చెందిన డీజే బ్లాక్ కాఫీ ఒక్కో ఈవెంట్‌కు సుమారు రూ.2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే ముంబైలో ఈ ఈవెంట్ పూర్తి కాగా, ఇప్పుడు హైదరాబాద్ తర్వాత గోవాలో మరో ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో పాల్గొ న్న రితేష్, జ్యోతి రాదిత్య, రిత్విక్ వాసల, అభిషేక్ వర్మ, ఆకెల్ల హరిత్ సరంగ, రిషబ్ శ్రీవాస్తవ, పిట్ల పృథ్వీరాజ్, మోనిష్ సత్వాని లకు డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.  

By
en-us Political News

  
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో దాడులు విపరీతంగా పెరిగిన సంగతి విదితమే. ముఖ్యంగా మొంబాసా బి, అల్ బహ్యా, జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ వెద్యాన్, అల్ రెకయ్యాత్ వంటి వాణిజ్య నౌకలపై జరిగిన వరుస దాడులు అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
ఆంక్షల ప్రకారం, సాధారణ పౌరులకు గానీ, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గానీ కోట ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. కేవలం ఈ వేడుకల ఏర్పాట్లలో పాల్గొనే ఉన్నతాధికారులు, సిబ్బంది,  అధికారిక అనుమతి పత్రాలు ఉన్న  వ్యక్తులను మాత్రమే కఠిన తనిఖీల అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు.
పాకిస్తాన్ సైనిక బలగాలు తమ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఆక్రమించుకున్నాయని అమ్జాద్ అయూబ్ మీర్జా ప్రకటించారు. ఈ ప్రాంతం ఎంతమాత్రం స్వతంత్రమైనది కాదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విద్యా రంగానికి సంబంధించి మొత్తం ఐదు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మూడు సాధారణ డే స్కూళ్లు కాగా, మిగిలిన రెండు పూర్తి స్థాయి వసతులతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్.. దానినుంచి బయటపడేందుకు డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అగ్రరాజ్యం విధించే కఠినమైన వ్యూహాత్మక నిబంధనలకు తలవొగ్గుతూ తన సొంత రక్షణ వ్యవస్థను పరాధీనం చేసుకుంటోందన్నది ఆ కథనాల సారాంశం.
మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతలు మరియు వంద డాలర్లు దాటిన క్రూడాయిల్ ధరల మధ్య భారత స్టాక్ మార్కెట్లు అద్భుత రికవరీ సాధించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24100 మార్కును దాటింది. మార్కెట్ తదుపరి గమనంపై విశ్లేషకుల అంచనాలు మీకోసం.
స్విట్జర్లాండ్‌లోని ETH జ్యూరిచ్ శాస్త్రవేత్తలు గిటార్ సూత్రాంతర్భాగంగా పనిచేసే సరికొత్త వేలి గోరు పరిమాణపు క్వాంటం చిప్‌ను ఆవిష్కరించారు. ఈ చిప్ విద్యుదయస్కాంత తరంగాల కంటే 1,00,000 రెట్లు చిన్న శబ్ద ప్రకంపనలను ఉపయోగించి డేటాను భద్రపరుస్తుంది, ఇది క్వాంటం ర్యామ్ (QRAM) పరిశోధనలో ఒక పెద్ద మైలురాయి.
స్కల్‌కాండీ సరికొత్త ప్రీమియం హెడ్‌ఫోన్స్ Crusher 1080 ANC విడుదల చేసింది. బోస్ సంస్థకు చెందిన బెస్ట్ ఇన్ క్లాస్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పేషియల్ ఆడియో ఫీచర్లతో, 60 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో సగం ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ గ్యాడ్జెట్ పూర్తి వివరాలు చూడండి.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గోల్ఫ్ టోర్నమెంట్ ది ఓపెన్ 2026 రాయల్ బర్క్‌డేల్‌లో ప్రారంభమైంది. స్కాటీ షెఫ్లర్, రోరీ మెక్‌ఇల్రాయ్ తలపడుతున్న ఈ మెగా ఈవెంట్‌ను మొబైల్ మరియు టీవీల్లో ఉచితంగా ఎలా చూడాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికా ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) 25% ఘోర పతనాన్ని చవిచూసినప్పటికీ, మెరుగైన క్యూ1 ఫలితాల అండతో భారతీయ ఐటీ షేర్లు మార్కెట్లో నిలదొక్కుకున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బంగారం మరియు గ్లోబల్ స్టాక్స్ వైపు మళ్లుతున్న భారతీయ పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన రిస్కులు ఇవే. అమెరికా బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్ ధరలు మరియు భౌగోళిక ఉద్రిక్తతల వల్ల మీ పోర్ట్‌ఫోలియోపై పడే ప్రభావం గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా ఘనవిజయం సాధించిన తర్వాత ఆటగాళ్లు ప్రదర్శించిన లాస్ మాల్బినాస్ సన్ అర్జెంటీనాస్ బ్యానర్ ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైంది. 1982 ఫాక్‌లాండ్ యుద్ధ గాయాలను రేపిన ఈ నినాదం వెనుక ఉన్న అసలు కథ, ఫిఫా నిబంధనలు మరియు అర్జెంటీనా జట్టు ఎదుర్కోబోయే చర్యల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.