మహానగరంలో డ్రోన్ సర్వే
Publish Date:Jul 31, 2018
Advertisement
హైదరాబాద్ ఓ మహా నగరం ఒక్కప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్,ఇప్పటి తెలంగాణ రాష్త్ర రాజధాని.నానాటికి అభివృద్ధి చెందుతున్న మహా నగరాల్లో ఇదొకటి.ఎంతో మంది జీవనోపాధి కోసం ఇక్కడికి వస్తుంటారు,వివిధ రాష్ట్రాల వారు ఉద్యోగ నిమిత్తం ఇక్కడ నివసిస్తున్నారు.ఇంత మంది జనాభా ఉన్నఈ మహానగరంలో వీధులు,ఇంటి నెంబర్ తెలుసుకోవాలంటే తిప్పలు తప్పట్లేదు.ఎక్కడ ఎవరు భవన నిర్మాణం చేపడుతున్నారో,ఎక్కడ ప్రభుత్వ స్థలాలు,ఖాళీ స్థలాలు ఉన్నాయో అర్ధం కానీ పరిస్థితి. ప్రస్తుతం ఉన్న డోర్ నంబర్ల వ్యవస్థ సరిగా లేక అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్ది ఎవరి చిరునామా అయినా సులభంగా తెలిసేలా ఏర్పాట్లు చేయమని అధికారులను ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.సాంకేతికతలో హైదరాబాద్ ముందుంది దేన్నీ అయినా స్మార్ట్ వర్క్ గా చేసే అధికారులు సాటిలైట్ ఇమేజ్ తీసుకొని దాని ఆధారంగా భవనాలను గుర్తించారు,వాటికి నెంబర్లను కేటాయించారు.అయితే ఈ సాకేతిక పరిజ్ఞానంతో మరో ముందు అడుగు వేసి డ్రోన్ల ద్వారా భవనాలను గుర్తించాలనుకుంటోంది.దీనిలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా డ్రోన్ సర్వే చేయించాలని బల్దియా కమిషనర్ జనార్దనరెడ్డి నిర్ణయించారు. ఆ తర్వాత ఈ రెండు విధానాల్లో దేనికి తక్కువ ఖర్చవుతుందో దాని వైపు మొగ్గు చూపవచ్చని అనుకుంటున్నారు. సీనియర్ అధికారులు మాత్రం డ్రోన్ సర్వే మరింత కచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు.గతంలో నాలా ఆక్రమణలపై అధికారులు నిర్వహించిన డ్రోన్ సర్వే విజయవంతం అవ్వటంతో ఈ నిర్ణయం ప్రయోజనాత్మకంగా ఉంటుందని నిపుణులు,అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/drone-survey-in-hyderabad-39-82907.html





