లైసెన్స్ లేని డ్రైవింగ్‌...వారం రోజుల్లో 1,940 కేసులు

Publish Date:Mar 7, 2026

Advertisement

 

నగరంలో రోడ్డు ప్రమా దాలను తగ్గించడమే లక్ష్యంగా హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు దిగింది. సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టి భారీగా కేసులు నమోదు చేసింది. ఈ నెల 1 నుంచి 7 తేదీల మధ్య హైదరాబాదు నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు మరియు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విస్తృతం గా తనిఖీలు నిర్వహిం చారు. తనిఖీల్లో వాహన దారులను ఆపి వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను పరిశీలించగా, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురు గుర్తించబడ్డారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ యాక్ట్, 1988 ప్రకారం మొత్తం 1,940 కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు.

లైసెన్స్ లేకుండా వాహనం నడపడం తీవ్రమైన నేరమని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. సరైన శిక్షణ లేకుండా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఇది ఇతర రోడ్డు వినియోగదా రుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి ప్రమాదానికి గురైతే వాహన బీమా క్లెయిమ్‌లను బీమా కంపెనీలు తిరస్కరించే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. అటువంటి సందర్భాల్లో బాధితులకు చెల్లించాల్సిన పరిహారం, వైద్య ఖర్చులు, ఆస్తి నష్టం వంటి అన్ని ఆర్థిక బాధ్యతలను వాహన యజమాని లేదా డ్రైవర్‌నే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో మైనర్లకు లేదా లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులు, వాహన యజమానులకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రత కోసం ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, డ్రైవింగ్ సమయంలో వెంట ఉంచుకోవాలని   ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్   D. జోయల్ డేవిస్ సూచిం చారు. నగరంలో రోడ్డు భద్రతను మెరుగుపర్చేం దుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.


 

By
en-us Political News

  
గోడౌన్‌లో నిల్వ ఉంచిన పెయింట్లు, ర రసాయనాల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి అనూప్ ప్రధాన్ శరీనం ఛిత్రమై శరీర భాగాలు పది మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి.
ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగెస్
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం నాడు ఒక భారీ పారిశ్రామిక దుర్ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో ఆదివారం ఉదయం ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టు ప్రకటన
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగర అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు
బీజేపీ నా సీటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ అన్నారు.
నేను హోంమంత్రిని కాకపోవడం ఆ క్రిమినల్స్ అదృష్టం...
సమాజంలో నేరస్థులను కేవలం నేరస్థులుగానే చూడాలని, వారికి కులం లేదా మతం అనే ముసుగు
హైదరాబాద్‌లోని KBR పార్క్ సమీపంలో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు పలువురు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
గాదె సాయికృష్ణ అదృశ్యం ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.