అత్తమీద కోపం దుత్త మీద.. ఏపీలో డ్రైవింగ్ లైసెన్సులు డిజిటలైజేషన్.. వెనక కథ ఇదీ?!

Publish Date:Aug 20, 2023

Advertisement

ఏపీలో వాహనదారులకు ఇకపై రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీలు కార్డు రూపంలో ఉండవు. సంబంధిత యాప్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న డాక్యుమెంట్లు సరిపోతాయి. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) కార్డుల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. ఇకపై డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల కోసం చెల్లించాల్సిన ఛార్జీలను కూడా ఆపేసింది. లైసెన్సులు, ఆర్సీలకు ఇప్పటి వరకు కార్డుకు రూ.200, పోస్టల్‌ సర్వీస్‌కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ఛార్జీలను కూడా వసూలు చేయడం లేదు. ఇకపై వాహనదారులు తమ మొబైల్స్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీని పోలీసులు, రవాణాశాఖ అధికారులకు చూపిస్తే సరిపోతుందని ప్రకటించింది. 

ప్రస్తుతమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. లావాదేవీలతో పాటు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయని.. అందుకే భారత ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియా ప్రాజెక్టును ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం దీనిని అమల్లోకి తీసుకువచ్చిందని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. వాహనదారులంతా మొబైల్‌లో ఏపీఆర్టీఏ సిటిజన్ యాప్‌ ద్వారా లైసెన్స్, ఆర్సీలను డౌన్‌లోడ్‌ చేసుకోని పెట్టుకొని అవసరమైనపుడు చూపిస్తే సరిపోతుందని ప్రకటించారు. అయితే, ఈ డిజిటలైజ్ చేయడం వెనక పెద్ద తతంగమే నడిచిందని ఇప్పుడు ప్రభుత్వ వర్గాల నుండి లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నిజానికి ఏపీ ప్రభుత్వం ఆర్టీఏ సర్వీసుల డిజిటలైజేష్ ప్రజలకు వెసులుబాటు కోసం చేసింది కాదనీ,   లైసెన్సులు, ఆర్సీలకు కావాల్సిన ముడి సరుకు కొరతతోనే ఇందుకు ఉపక్రమించిందని అంటున్నారు. మొన్నటి వరకు లైసెన్సులు, ఆర్సీల కోసం వాహనదారుల నుండి కార్డుకు రూ.200, పోస్టల్‌ సర్వీస్‌కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇలా ఏడాది కాలంగా డబ్బులు చెల్లించిన ఎవరికీ ఈ కార్డులు పంపించలేదు. గత ఏడాది కాలంగా డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీలు కార్డు రూపంలో పంపిణీ చేయడానికి వాహనదారుల నుండి డబ్బులు తీసుకున్నారు కానీ, ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో డబ్బులు కట్టకపోవడంతో కార్డులు పంపాల్సిన వెండర్లు రవాణాశాఖకు పంపించలేదు. అప్పటికే పెండింగ్ బిల్లులు ఉండగా.. అవి క్లియర్ చేస్తేనే కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వం ఈ డిజిటల్ ఆలోచన చేసిందని చెబుతున్నారు. ఇకపై ఈ కార్డుల కోసం చెల్లించాల్సిన రూ.225 అవసరం లేదని చెప్తున్న రవాణా శాఖ.. గత ఏడాది కాలంగా ఈ డబ్బు చెల్లించిన వారికి కార్దులు పంపిస్తామని, అందుకు కొంత సమయం పడుతుందని చెప్తున్నారు. అయితే, ఇక కార్దుల ఆశ వదులుకోవాల్సిందేనని ఆర్టీఏ ఏజెంట్లు చెప్తున్నారు.

అంత బాగానే ఉంది.. అందరూ తమ ఫోన్లలో యాప్ ఇంస్టాల్ చేసుకొని లైసెన్స్, ఆర్సీ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ, చదువు లేని వారు.. స్మార్ట్ ఫోన్ లేని వారి పరిస్థితి ఏమిటి? ఇలాంటి వారంతా మీ సేవా, లేదా ఆన్ లైన్ సెంటర్ కి వెళ్లి తమ వివరాలతో పత్రాలు డౌన్ లోడ్ చేసి ఆ కాగితాలను తమ వద్ద ఉంచుకొని రవాణాశాఖ అధికారులకు చూపిస్తే సరిపోతుందని చెప్తున్నారు. మిగతా చాలా రాష్ట్రాలలో ఈ డిజిటల్ విధానం ఉన్నా.. కార్దులు కూడా జారీ చేస్తారు. కార్డులు దగ్గర ఉన్న వారు అవి చూపిస్తే మిగతా వారు డిజిటల్ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే, ఏపీలో మాత్రం ముందూ వెనకా చూడకుండా.. పర్యవసానాలేంటి అన్న ఆలోచన లేకుండా పూర్తిగా డిజిటల్ విధానం ఒక్కటే తీసుకొచ్చారు. ఇది కేవలం నిధులు చెల్లించకపోతే కార్దులు జారీ చేయడం కుదరదన్న వెండర్ల మీద కోపంతో తీసుకొచ్చిన విధానం మాత్రమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.