దృశ్యం మూవీ చూసి తండ్రిని హత్య చేసిన కొడుకు..పోలీసులకు ఎలా చిక్కాడో తెలిస్తే షాకే..?

Publish Date:Oct 4, 2026

Advertisement

సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ఫూర్తితో కన్నతండ్రినే హత్య చేసిన ఓ కొడుకు ఉదంతం బిహార్‌లో కలకలం రేపింది. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. దర్వా గ్రామానికి చెందిన రఘువీర్ సాహ్ని, ఆయన కుమారుడు శివ్ శంకర్ మధ్య కొంతకాలంగా ఆస్తి, కుటుంబ విషయాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. సూరత్‌లో నివసిస్తున్న శివ్ శంకర్.. తండ్రిపై కక్ష పెంచుకుని హత్యకు కుట్ర పన్నాడు.

ఈ క్రమంలో సూరత్‌లో ‘దృశ్యం-3’ సినిమా చూసిన శివ్ శంకర్.. సినిమాలో చూపించినట్టుగా పోలీసులకు ఆధారాలు దొరకకుండా హత్య చేయాలని ప్లాన్ చేశాడు. సూరత్ నుంచి బయలుదేరే ముందే తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. అనంతరం రైలులో సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి బిహార్‌లోని పటోరి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో గ్రామానికి వెళ్లి.. అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక తలుపు నుంచి లోపలికి ప్రవేశించాడు. గాఢ నిద్రలో ఉన్న తండ్రి రఘువీర్ సాహ్నిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా అక్కడి నుంచి తిరిగి సూరత్‌కు బయలుదేరాడు.

అయితే.. నిందితుడు ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఓ చిన్న తప్పిదం అతడి గుట్టును రట్టు చేసింది. పటోరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న శివ్ శంకర్.. అప్పటివరకు స్విచ్ ఆఫ్‌లో ఉన్న ఫోన్‌ను ఆన్ చేసి తన భార్యకు కాల్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ ఆఫ్ చేశాడు. ఈ కాల్ పోలీసులకు కీలక ఆధారంగా మారింది. కాల్ డేటా, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అతడి కదలికలను ట్రాక్ చేశారు. హత్య జరిగిన సమయంలో పటోరి ప్రాంతంలో అతడి ఫోన్ యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సూరత్‌లో అతడి కదలికలను గుర్తించి అక్కడే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శివ్ శంకర్ తండ్రిని తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సినిమా తరహాలో పోలీసులను మోసం చేయాలని చూసిన నిందితుడు.. చివరకు ఒక్క ఫోన్ కాల్‌తో పోలీసులకు చిక్కాడు.

 

 

 

 

 

[ Drishyam 3, Bihar Murder, Father Murder, Son Kills Father, Samastipur Crime, Shivsankar, Raghuveer Sahni, Crime Thriller, Movie Inspired Murder, Axe Attack, Property Dispute, Murder Case, Police Investigation, Technical Surveillance, Call Data Record, Mobile Tower Location, Patouri Railway Station, Surat, Bihar Crime, Crime News ]


 

By
en-us Political News

  
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.