ఛీ ఛీ.. బూటులో బీరా ?.. ఆసీస్ ఆటగాళ్ల ఓవరాక్షన్..
Publish Date:Nov 15, 2021
Advertisement
దుబాయ్ వేదికగా జరిగిన టీట్వంటీ వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఫైనల్లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి తొలిసారి టైటిల్ సాధించింది. 18.5 ఓవర్లలోనే న్యూజిలాండ్ నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సాధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్ పరుగుల వరద పారిస్తూ ఆసీస్ జట్టును విజేతగా నిలిపారు. తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలితిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు దుబాయ్ మైదానంలో గెలుపు సంబరాలు చేసుకున్నారు. సౌథీ బౌలింగ్‌లో మాక్స్వెల్ బౌండరీ బాదగానే మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆటగాళ్లు ఒకరినొకరు ఆలింగనాలు చేసుకొని సంబరపడ్డారు. తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో గోల గోల చేశారు. ఈ క్రమంలోనే ఆసీస్ కీపర్ మాథ్యూవేడ్, ఆల్‌రౌండర్ స్టోయినిస్ ఒక బూటులో కూల్ డ్రింక్ పోసుకొని తాగారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది. గెలుపు సంబరాల్లో భాగంగా ఆసీస్ ఆటగాళ్ల ప్రవర్తనపై సోషల్ మీడియాతో జోరుగా చర్చ సాగుతోంది. విజయోత్సవాల్లో ఇలాంటివి కామన్ అని కొందరు కామెంట్లు చేస్తుండగా... ఆసీస్ ఆటగాళ్లు అతి చేశారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/drinking-beers-in-shoes--aussie-cricketers-celebrations-after-victory-39-126382.html





