ప్రాణదీపం వెలిగించే అమృతహస్తం... డాక్టర్ జి.సూర్యనారాయణ రాజు

Publish Date:Apr 18, 2015

Advertisement



ఆయన హస్తవాసి చాలా మంచిది... ఎంత మంచిదీ అంటే... ఆయన చేతిలో ధనరేఖ తరహాలో ‘ప్రాణరేఖ’ లాంటిదేమైనా వుందా అనిపించేంత మంచింది. మరణానికి చేరువలో వున్నవారైనా సరే, ఆయన చేయి పడిందంటే చాలు... కొడిగట్టే దశలో వున్న వారి ప్రాణదీపం దేదీప్యమానంగా వెలుగుతుంది. వైద్యో నారాయణో హరిః అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే డాక్టర్ ఆయన! ఆయన ఎవరో కాదు... ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మన తెలుగుబిడ్డ... డాక్టర్ గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు.

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో అసోసియేట్ డీన్, సీనియర్ ప్రొఫెసర్‌ స్థానంలో వుండటంతోపాటు సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్‌కి హెడ్‌గా కూడా విధులు నిర్వహిస్తున్న ఆయన ఎంతోమంది కేన్సర్ వ్యాధిగ్రస్తుల జీవితాలలో కాంతి నింపారు. ప్రపంచమంతా కేన్సర్ వ్యాధిని చూసి భయపడుతుంది. అతిశయోక్తి అనిపించినా నిజం ఏమిటంటే.... డాక్టర్ సూర్యనారాయణరాజును చూస్తే కేన్సర్ వ్యాధి భయపడుతుంది. పేషెంట్ మీద ఆయన చెయ్యి పడిందంటే చాలు కేన్సర్ మహమ్మారి పేషెంటును వదిలి పారిపోతుంది. కేన్సర్‌ వ్యాధి నివారణకు ఆయన చేస్తున్న కృషి అనన్య సామానమైనది. 1998 నుంచి 2014 సంవత్సరం వరకు ఆయన 1,42,692 మంది కేన్సర్ ఔట్ పేషెంట్లను ట్రీట్ చేశారు. 29,808 మంది కేన్సర్ పేషెంట్లకు సర్జరీ నిర్వహించారు. ఆయన సర్జరీ చేసిన పెషెంట్లలో దాదాపు 98 శాతం మంది పేషెంట్లు కొత్త జీవితాన్ని పొందారు..

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన జి.సూర్యనారాయణరాజు చిన్నప్పటి నుంచీ చదువులో నంబర్‌వన్. డాక్టర్ కావాలని, ప్రజలకు సేవ చేయాలన్నదే ఆయనకు బాల్యం నుంచీ వున్న యాంబిషన్. తాను కోరుకున్నట్టుగానే డాక్టర్‌ అయిన ఆయన కెరీర్‌లో ఎన్నెన్నో మైలురాళ్ళు. ఎన్నెన్నో విజయాలు. 1992 సంవత్సరం నుంచి హైదరాబాద్‌లో నిమ్స్‌లో డాక్టర్‌గా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుంచీ ఎన్నో విజయాలు సాధిస్తూ ఆయన ముందడుగు వేశారు. ఒక డాక్టర్‌గా ఆయన నిర్వహించిన పదవులను, ఆయన చదివిన చదువులను, ఆయన అధిరోహించిన విజయ శిఖరాలను, అందుకున్న కీర్తి కిరీటాలను ప్రస్తావించాలంటే పెద్ద గ్రంథం రాయాల్సి వుంటుంది. ఎన్ని విజయాలు సాధించినా, మృత్యుముఖంలో వున్న ఒక రోగిలో ప్రాణ దీపం వెలిగించినప్పుడు ఆ వ్యక్తిలో, వారి కుటుంబ సభ్యుల్లో కనిపించే ఆనందాన్ని చూడటమే తనకు గొప్ప విజయంగా అనిపిస్తూ వుంటుందని డాక్టర్ సూర్యనారాయణ రాజు చెబుతారు. జననీ జన్మభూమిశ్చ... స్వర్గాదపీ గరీయసీ అంటారు... అందుకే డాక్టర్ రాజు గారు తన జన్మభూమికి తనవంతు సేవ చేస్తుంటారు. హైదరాబాద్‌లో డాక్టర్‌గా ఊపిరిసలపనంత బిజీగా వున్నప్పటికీ, తన స్వస్థలమైన ఆకివీడులో ప్రతినెల మొదటి ఆదివారం నాడు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వుంటారు. ఆ ఒక్కరోజే ఆయన దాదాపు రెండు వందల మంది పేషెంట్లను చూస్తారు.

భగవంతుడు మనకు ప్రత్యక్షంగా కనిపించడు... జన్మనిచ్చిన అమ్మ రూపంలో, ప్రాణం పోసే వైద్యుడి రూపంలో మనకు కనిపిస్తూ వుంటాడు. అలాంటి భగవంతుడి స్వరూపమైన వైద్య వృత్తిలో  నిర్విరామంగా కృషి చేస్తూ వేలాదిమంది జీవితాలలో సంతోషాన్ని నింపిన డాక్టర్ జి.సూర్యనారాయణరాజు తన కెరీర్‌లో వ్యక్తిగత జీవితంలో మరిన్ని విజయాలను అందుకోవాలని ‘తెలుగువన్’ కోరుకుంటోంది.

By
en-us Political News

  
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు...
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, ‘ముద్రలు’ కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే ‘ముద్ర’ అంటారు.
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది...
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం..
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.