బీచ్ లో కునుకు.. కాలిఫోర్నియా సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరు ఇండియన్ విద్యార్థినులు

Publish Date:Jun 17, 2026

Advertisement


అమెరికాలో జరిగిన విషాద ఘటనలో ఇద్దరు ఇండియన్ విద్యార్థినులు బలయ్యారు. . కాలిఫోర్నియాలోని శాంటాక్రూజ్ కౌంటీ  సముద్ర తీరంలో  ఈ విషాదం చోటు చేసుకుంది. అగ్రరాజ్యంలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు  వీకెండ్ ట్రిప్ కోసం బీచ్ కు వెళ్లి సముద్రంలో మునిగిపోయారు.  

మృతులను కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ నగరానికి చెందిన 21 ఏళ్ల హర్షిత నాయర్  20 ఏళ్ల మహియాల్ శ్రాన్  గా గుర్తించారు. వీరిద్దరూ ఫ్రీమాంట్‌లోని వాషింగ్టన్ హైస్కూల్‌లో 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాటి నుండి  మంచి స్నేహితులు. ప్రస్తుతం హర్షిత నాయర్ ప్రతిష్టాత్మక యూసీ బెర్క్లీ యూనివర్సిటీలో లీగల్ స్టడీస్ చదువుతుండగా, మహియాల్ శ్రాన్ శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్ విద్యార్థినిగా ఉన్నారు. సెలవు దినాన్ని ఆనందంగా గడపడానికి వెళ్లిన ఈ ఇద్దరు బీచ్ కు వెళ్లారు.

ఈ నెల 10న పాంథర్ బీచ్ లో కీ హోల్ అనే  సహజ రాతి గుహ ద్వారం వద్ద వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రయాణ అలసట వల్ల  చిన్న కునుకు తీశారు. అయితే.. ఆ  సమయంలో, సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. రాకాసి అలలు, తీరంలో నిద్రిస్తున్న హర్షిత, మహియాల్‌లను క్షణాల్లో సముద్ర గర్భంలోకి లాగేశాయి. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న కాల్ ఫైర్, స్టేట్ పార్క్స్ మరియు స్థానిక అగ్నిమాపక విభాగానికి చెందిన  రెస్క్యూ స్విమ్మర్లు అత్యంత వేగంగా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.

రాతి కొండలు, ఉధృతమైన అలల మధ్య సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎంతో సవాలుతో కూడుకున్నది. రెస్క్యూ సిబ్బంది ఒక యువతిని హెలికాప్టర్ ద్వారా, మరొకరిని స్టోక్స్ బాస్కెట్ సాయంతో తీవ్ర శ్రమకోర్చి ఒడ్డుకు తీసుకువచ్చారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అయితే, దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ హర్షిత నాయర్ ఈ నెల 11న మరణించగా, ప్రాణాలతో పోరాడిన మహియాల్ శ్రాన్ ఆదివారం (జూన్ 15)  కన్నుమూసింది. 

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్గత రోడ్లు నిర్మాణ పరిస్థితిపై... టోన్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ స్టేట్మెంట్ నమోదు..
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎపై గెలిచిన భారత్-ఎ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది
ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్ చేసిన వాసుదేవ రెడ్డి, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈడీ కోర్టును ఆశ్రయించారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఝార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
ప్రతీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ...
రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ కేసులో కస్టడీ విచారణ ముమ్మరం...
కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకార సంఘాలకు కీలక సూచనలు చేశారు
క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్‌లకు నోటీసులు పంపిన TCA..
హైదరాబాద్‌ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం తగ్గిపోతున్నా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల రెట్లు విస్తరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.