వానళ్లు కురవాలి వానదేవుడా... అంటే కర్నాటకలోని ఓ గ్రామంలో వినూత్నంగా వరుణ దేవుడిని పూజించారు. ఆ గ్రామమంతా పెళ్లి సందడి నెలకొంది. పిల్లా, పెద్దా, ఆడా, మగా అందరూ కలిసి వరుణుడిని ప్రసన్నం చేసుకోవడానికి గార్ధభాలకు అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడలగి తాలూకా మున్యాళ గ్రామంలో ఈ అరుదైన వివాహం నిజంగానే జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామస్థులు గాడిదలకు ఘనంగా వివాహం జరిపించారు. ఈ ఆచారం ఆ గ్రామంలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని స్థానికులు చెప్పారు. ఆధునిక కాలంలోనూ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిర్వహించిన ఈ వినూత్న వివాహం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్‌గా మారింది.
గ్రామస్థులు మగ గాడిదకు కాంతేశ్, ఆడ గాడిదకు కస్తూరి అని పేర్లు పెట్టి, నిజమైన పెళ్లి వేడుకను తలపించేలా, ఇంకా చెప్పాలంటే తలదన్నేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. పెళ్లి వేడుకలో మహిళలు మంగళహారతులు పట్టగా, గ్రామ యువకులు డప్పుల చప్పుళ్లతో సందడి చేశారు. నవ దంపతులను ఆశీర్వదిస్తూ గ్రామస్థులు హర్షధ్వానాలు చేశారు.
వివాహం అనంతరం గ్రామానికి వచ్చిన అతిథులందరికీ ఘనంగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గాడిదల పెళ్లి ఊరేగింపు, సంప్రదాయ పద్ధతిలో జరిగిన తంతు అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో వర్షాలు సరిగా కురవక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పూర్వీకుల కాలం నుంచి వస్తున్న విశ్వాసం ప్రకారం గాడిదలకు వివాహం జరిపిస్తే వర్షదేవుడు ప్రసన్నమై మంచి వర్షాలు కురుస్తాయని నమ్మకం ఉందన్నారు. ఆ విశ్వాసంతోనే గ్రామ ప్రజలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/donkeys-marriage-in-karnataka-36-225222.html
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బ్యాంకింగ్ రంగంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వినియోగంపై కొత్త డ్రాఫ్ట్ రూల్స్ తెచ్చింది. మోడల్ రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం తెచ్చిన ఈ నిబంధనలతో బ్యాంకింగ్ రంగంలో ఏఐ గవర్నెన్స్, మోడల్ వాలిడేటర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జూలై 7న దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ. 13,600 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ సహా మీ నగరంలో నేటి 22K, 24K పసిడి లేటెస్ట్ రేట్లను ఇప్పుడే తెలుసుకోండి!
జపాన్ వెళ్లే భారతీయ ప్రయాణికులకు అలర్ట్. కొత్త వీసా నిబంధనలు, ఈ వీసా ప్రాసెస్, మారిన ఫీజుల వివరాలు మరియు ట్రాన్సిట్ వీసా రద్దు గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను పెంచాయి. SBI, HDFC, PNB మరియు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 7.50% నుండి 9.00% వరకు లభిస్తున్న గరిష్ట వడ్డీ రేట్లు, కాలపరిమితి మరియు పన్ను ఆదా వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ నెల 1న ఆయన ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో సమాజ శాంతిని దెబ్బతీసేలా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోకడలు ఏ మాత్రం మంచివి కావన్నారు.
నోయిడాకు చెందిన సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ క్రాటికల్ టెక్ Kratikal Tech BSE SME ప్లాట్‌ఫామ్‌పై గ్రాండ్‌గా లిస్ట్ అయింది. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ట్రేడింగ్ నిబంధనలు, పెట్టుబడి వివరాలు మరియు థ్రెట్‌కాప్ ThreatCop సాస్ ప్లాట్‌ఫామ్ భవిష్యత్తుపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్‌కప్ రౌండ్ 16లో అమెరికాకు ఘోర పరాజయం. 4 1 గోల్స్ తేడాతో అమెరికాను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన బెల్జియం. చార్లెస్ డీ కెటిలేరి అద్భుతమైన డబుల్ గోల్స్ హైలైట్.
నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో టెలికాలర్‌గా పనిచేసిన నిదాఖాన్, యూనిట్ లో మతమార్పిడులు, లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పరారయ్యారు. దాదాపు 42 రోజుల పాటు అజ్ఝాతంలోకి వెళ్లిన ఆమెను పోలీసులు మేలో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఆటపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ సిరీస్ మరియు టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల గురించిన పూర్తి వివరాలు మీకోసం.
ప్పందాన్ని బేఖాతరు చేస్తూ.. ఇరాన్ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామం మళ్లీ ఒక్కసారిగా శాంతి ఆశలను ఆవిరి చేసేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా క్షిపణి దాడులకు తెగబడింది.
సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ (ఓఎస్ఏటీ) రంగంలో గ్లోబల్ లీడర్ అయిన అపాక్ట్ కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో భేటీలో ఆ కంపెనీ ఏపీలో భారీ పెట్టుబడికి అంగీకరించింది. ఏఎస్ఐపీ టెక్నాలజీస్‌తో జతకట్టి, విశాఖపట్నంలో ఓఎస్ఏటీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా అనుమతులు లభించినట్లు అపాక్ట్ సీఈవో వెల్లడించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్ 17 సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా నౌకాదళంలో చేరబోతున్నది. విశాఖపట్నం వేదికగా.. ఈ నెల 11న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నౌకాదళంలోకి కమిషన్ చేయనున్నారు.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.